Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నూతనకల్
ప్రధాని మోదీ ప్రభుత్వ కార్మిక, కర్షక,ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఈనెల 5న జరిగే చలోఢిల్లీ కారయక్రమాన్ని జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయకార్మిక సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి మట్టిపల్లి సైదులు పిలుపునిచ్చారు.శనివారం మండలకేంద్రంలో సీఐటీయూ,వ్యవసాయ కార్మికసంఘం,రైతుసంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రచారజాతానుద్దేశించి ఆయన మాట్లాడారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 8 ఏండ్లుగా దేశంలో అమలు చేస్తున్న కార్పొరేట్, మతోన్మాద అనుకూల విధానాలు, రైతు,కార్మిక, ప్రజావ్యతరేక విధానాలతో నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగే నిరసనకు లక్షలాదిమంది తరలొచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎం.రాంబాబు,శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్ చెరుకు ఏకలక్ష్మి,తెలంగాణ రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షులు కందాల శంకర్‌రెడ్డి, సీఐటీయూ మండల కన్వీనర్ బొజ్జ శ్రీను, రైతుసంఘం మండలకార్యదర్శి కుసు సైదులు,వ్యవసాయకార్మికసంఘం మండల కార్యదర్శి పులసరి వెంకటముత్యం, నాయకులు గజ్జల శ్రీనివాస్‌రెడ్డి, కందాల కృష్ణారెడ్డి, బాలగాని సోమయ్య, పున్నయ్య, శ్రీను, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కార్పొరేట్ కంపెనీలకు పెద్దపీట వేస్తున్న మోడీ ప్రభుత్వం
మద్దిరాల: కార్పొరేట్ శక్తులకు పెద్దపీట వేస్తూ దేశ సంపదను అంబాని, అదానీలకు బీజేపీ ప్రభుత్వం కట్టబెడుతుందని తెలంగాణ వ్యవసాయకార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు విమర్శించారు.సీఐటీయూ,రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న జీపు ప్రచారజాతా మండలానికి చేరుకుంది.ఈ సందర్భంగా సైదులు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు తను చేసిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకోలేకపోయిందన్నారు.ఏడాదికి కోటి ఉద్యోగాలని ప్రైవేటీకరణ పేరుతో లక్షలాది ఉద్యోగాలను ఊడగొట్టారన్నారు.నల్లధనం వెలికితీత పేరుతో నోట్లను రద్దు చేసిన బీజేపీ ప్రభుత్వం అంతకంటే పెద్దనోట్లను ముద్రించి అవినీతికి పెద్దఎత్తున తెర లేపిందన్నారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎం.రాంబాబు, శ్రామికమహిళా జిల్లా కన్వీనర్ చెరుకు ఏకలక్ష్మీ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కల్లేపల్లి భాస్కర్, వల్లోజు యాదగిరి, వెంకన్న, ఎల్లయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.
మోతె: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను విడనాడాలని తెలంగాణ వ్యవసాయకార్మిక సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి మట్టిపల్లి సైదులు పిలుపునిచ్చారు.సీఐటీయూ, రైతుసంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జీపు ప్రచార జాతా మండలంలోని రాఘవపురం ఎక్స్‌రోడ్డు,సిరికొండ, రావిపహాడ్ గ్రామాలలో కొనసాగింది.ఈ సందర్భంగా గ్రామాల్లో నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు.కేంద్రంలో అధికారంలోకొచ్చిన బీజేపీ ఎన్నికలకు ముందు తాను చేసిన ఏ ఒక్క వాగ్దానాన్ని నిలబెట్టుకోలేక పోయిందన్నారు . లేబర్ చట్టాల పేరుతో కార్మిక వర్గం సాధించుకున్న అనేక హక్కులను కాలరాసే విధంగా పార్లమెంటులో చట్టాలను చేసిందన్నారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు రాంబాబు, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ చెరుకు ఏకలక్ష్మి,కిన్నెర పోతయ్య, గుంటగాని ఏసు, చిట్యాల రవిచంద్ర చారి,మహేశ్ పాల్గొన్నారు.
చివ్వెంల: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు,కార్మిక,వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఏప్రిల్ 5న జరిగే చలోఢిల్లీని ప్రజలంతా లక్షలాదిగా తరలిరావాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు పిలుపునిచ్చారు.సీఐటీయూ, రైతుసంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్న జీపు ప్రచారజాతా మండలానికి చేరుకుంది.ఈసందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు తను చేసిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకోలేకపోయిందన్నారు.ఏడాదికి కోటి ఉద్యోగాలని ప్రైవేటీకరణ పేరుతో లక్షలాది ఉద్యోగాలను ఊడగొట్టారని, నల్లధనం వెలికితీత పేరుతో నోట్లను రద్దు చేసిన బీజేపీ ప్రభుత్వం అంతకంటే పెద్దనోట్లను ముద్రించి అవినీతికి పెద్దఎత్తున తెర లేపిందన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎం.రాంబాబు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు చెరుకు ఏకలక్ష్మి, సీఐటీయూ మండలనాయకులు అమ్మయ్య, రాములు, వెంకన్న, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
తుంగతుర్తి: ప్రధాని మోడీ ప్రభుత్వ కార్మిక, కర్షక,ప్రజా వ్యతిరేక విధానాల వ్యతిరేకిస్తూ ఈనెల 5న జరిగే చలోఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపెళ్లి సైదులు పిలుపునిచ్చారు. శనివారం సీఐటీయూ,వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రచారజాతా మండలానికి చేరుకుంది.ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మోడీ గద్దెదిగేంత వరకు ప్రజలు ఐక్యంగా పోరాడాలని కోరారు.జాతాకు రైతుసంఘం, సీఐటీయూ, వ్యకాస నాయకులు ఘనస్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎం.రాంబాబు,శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ చెరుకు ఏకలక్ష్మీ, జిల్లా నాయకులు బుర్ర శ్రీనివాస్, రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షులు కందాల శంకర్‌రెడ్డి, పల్లా సుదర్శన్, సీఐటీయూ మండల నాయకులు అంతయ్య ,రైతుసంఘం మండలనాయకులు విష్ణుమూర్తి, ఎల్లయ్య, వ్యవసాయ కార్మికసంఘం మండల కార్యదర్శి ముత్తయ్య, నాయకులు దేవరాజు తదితరులు పాల్గొన్నారు.
తిరుమలగిరి : కార్పొరేట్ శక్తులకు పెద్ద పీట వేస్తూ దేశ సంపదను అంబానీ , అదానీలకు బిజెపి ప్రభుత్వం కట్టబెడుతుందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టి పెళ్లి సైదులు అన్నారు. సీఐటీయూ, రైతుసంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్న జీపు ప్రచారజాతా మండలానికి చేరుకుంది. ఈసందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు.కేంద్రంలోని ప్రధాని మోడీ సంవత్సరానికి కోటి ఉద్యోగాలని ప్రైవేటీకరణ పేరుతో లక్షలాది ఉద్యోగాలను ఊడగొట్టారన్నారు.నల్లధనం వెలికితీత పేరుతో నోట్లను రద్దు చేసిన బీజేపీ ప్రభుత్వం అంతకంటే పెద్ద నోట్లను ముద్రించి అవినీతికి పెద్దఎత్తున తెర లేపిందని విమర్శించారు.కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడం కోసం ఈనెల 5న ఢిల్లీలో జరిగే నిరసన కార్యక్రమానికి పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా విచ్చేసిన నాయకులకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎం.రాంబాబు, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ చెరుకు ఏకలక్ష్మి, తెలంగాణ రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షులు కందాల శంకర్‌రెడ్డి,జీఎంపీఎస్ జిల్లా అధ్యక్షులు కడెం లింగయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు మిట్టపల్లి లక్ష్మీ, వనం సోమయ్య, రాజ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
అంబాని,అదానిలకు ప్రజాసంపదను దోచిపెడుతున్న మోడీ
ఆత్మకూరుఎస్ : దేశ ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం అంబాని, అదానిలకు ప్రజా సంపదను అక్రమంగా దోచిపెడుతుందని తెలంగాణ వ్యవసాయ కార్మికసంఘం జిల్లా ప్రధానకార్యదర్శి మట్టిపల్లి సైదులు విమర్శించారు.శనివారం సీఐటీయూ,రైతుసంఘం, వ్యవసాయ కార్మిక సంఘంఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న జీపు ప్రచారజాతా మండలపరిధిలోని కోటపహాడ్, తుమ్మలపెన్‌పహాడ్, దాచారం, ఏపూరు గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు తను చేసిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకోలేకపోయిందన్నారు.ఏడాదికి కోటి ఉద్యోగాలని ప్రయివేటీకరణ పేరుతో లక్షలాది ఉద్యోగాలను ఊడగొట్టారని, నల్లధనం వెలికితీత పేరుతో నోట్లను రద్దు చేసిన బీజేపీ ప్రభుత్వం అంతకంటే పెద్దనోట్లను ముద్రించి అవినీతికి పెద్దఎత్తున తెర లేపిందన్నారు.పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెంచడంమూలంగా నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడానికి కారణమైందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇలాంటి విధానాలను ఎదురు కొనకపోతే,ఈ విధానాలను కొనసాగిస్తున్న ప్రభుత్వాన్ని గద్దె దించకపోతే రాబోవు రోజుల్లో ప్రజలు మరింత ఇక్కట్ల పాలవుతారని తెలిపారు.ఈ ప్రభుత్వానికి నిలదీయడం కోసం ఏప్రిల్ 5న ఢిల్లీలో జరిగే నిరసన కార్యక్రమానికి పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు రాంబాబు,సీఐటీయూ శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ చెరుకు ఏకలక్ష్మీ, మండల కన్వీనర్ యాతాకుల వెంకన్న, బోయిళ్ళసాంబయ్య,కల్లుగీత కార్మిక సంఘం మండల కార్యదర్శి బెల్లంకొండ ఇస్తారి, నాయకులు పెండెం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.