Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎంకేజేయూ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్
నవతెలంగాణ-ఆలేరుటౌన్
బడుగు, బలహీన వర్గాల ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి జర్నలిస్టు పనిచేయాలని టీఎంకేజేయూ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్ అన్నారు.నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం టీఎంకేజేయూ జిల్లా స్థాయి జర్నలిస్టుల సమావేశం మున్నూరుకాపు సంఘం భవనం ఆవరణలో జిల్లా కన్వీనర్ ఎలుగల కుమారస్వామి పటేల్ అధ్యక్షతన నిర్వహించారు. 2023 డైరీని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులకు, సంఘం సభ్యులకు , ప్రజలకు చేదోడుగా వాదోడుగా ఉంటూ సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తానన్నారు. రానున్న రోజుల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి జర్నలిస్టుల సంఘ సమావేశం ఆలేరు నియోజకవర్గం లోని యాదగిరిగుట్టలో నిర్వహించనున్నామన్నారు. స్టేట్ కోఆర్డినేటర్ తూడి జనార్ధన్ పటేల్ మాట్లాడుతూ జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు, విద్యనాభ్యసించే విద్యార్థులకు సంఘ సహకారం ఉంటుందన్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ సంఘం ద్వారా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. సభను ఉద్దేశించి యోగేశ్వరరావు , ఎం శ్రీశైలం , దాదె వెంకట్ పోరెడ్డి శ్రీనివాస్ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం జర్నలిస్టులు ఎలుగలకుమారస్వామి, పటేల్, సురేందర్ పటేల్, కందుల శ్రీనివాస్ పటేల్, ఆధ్వర్యంలో ఆహ్వానితులు డైరీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంగ అధ్యక్షులు ఎలుగల స్వామి, ప్రధాన కార్యదర్శి ఎలగల అంజయ్య, నియోజకవర్గ నాయకులు పోరెడ్డి శ్రీనివాస్, పోరెడ్డి ప్రసాద్, పత్తి రాములు, అనంతుల గురుమూర్తి,పగడాల రాంబాబు, బాలరాజు, రమేష్, రాము సంఘం సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.