Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భువనగిరిరూరల్
భువనగిరి మండలంలోని మన్నెవారిపంపు, జమ్మాపురం గ్రామాలలో నేడు నూతన గ్రామ శాఖ అధ్యక్షులు ఎన్నుకున్నట్లు కాంగ్రెస్ మండల కోర్ కమిటీ సభ్యులు తెలిపారు.ఆదివారం జమ్మాపురం అధ్యక్షులుగా పామిశెట్టి సుధాకర్, ఉపాధ్యక్షులుగా పసల సునీల్ పామిశెట్టి భాస్కర్, ప్రధాన కార్యదర్శిగా చిన్నబత్తినిప్రసాద్, మన్నేవారిపంపు గ్రామ శాఖ అధ్యక్షులుగా గుండ్ల రాజశేఖర్రెడ్డి, ఉపాధ్యక్షులుగా గుజ్జ నర్సింహ,గంగాదేవి కొండల్, ప్రధానకార్యదర్శిగా బోయిని మల్లేశంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో కోర్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికలలో భువనగిరి ఖిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు.ఈ కార్యక్రమంలో కోర్ కమిటీ సభ్యులు ఎలిమినేటి కృష్ణారెడ్డి, చిక్కుల వెంకటేష్, పిన్నంరాజు, వళ్ళందాస్ ఆదినారాయణ, ఎల్లాంల జంగయ్యయాదవ్, పాశం శివానంద్, విటల్ వెంకటేష్ పాల్గొన్నారు.