Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆలేరుటౌన్
శ్రమజీవుల రాజ్యం సాధించడమే పాపన్నకు నిజమైన నివాళి అని కేజీకేఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు దూపటి వెంకటేష్ అన్నారు. మండలకేంద్రంలో ఆదివారం సర్దార్ సర్వాయి పాపన్న 313 వర్ధంతి పురస్కరించుకొని పట్టణంలోని ఆయన విగ్రహానికి కల్లుగీత కార్మిక సంఘం ఫెడరేషన్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో సింగిల్ విండో మాజీ చైర్మెన్ మోరిగాడి చంద్రశేఖర్, మండల అధ్యక్షుడు మండల అధ్యక్షులు పూజారి కుమారస్వామి, మండల కార్యదర్శి మిట్ట శంకరయ్య ,మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు మోరిగాడి రమేష్, జనగాం శంకరయ్య, వెంకటేష్, గొడిశల సత్యనారాయణ, లక్ష్మణ్, అశోక్, అంజయ్య, గానగాని మల్లేశం, కిష్టయ్య, రాజశేఖర్, రవి, రాజు, మహేష్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.