Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బొమ్మలరామారం
మండలంలోని చీకటిమామిడి గ్రామంలో ఈనెల 5వ తేదీనజరిగే ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేయాలని ఎంపీపీ చిమ్ముల సుధీర్‌రెడ్డి కోరారు.మండలంలోని చీకటిమామిడి గ్రామంలోని శ్రీ బాలాజీ ఫంక్షన్హాల్లో ఆదివారం సర్పంచులు ఎంపీటీసీలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 5వ తేదీన జరిగే ఆత్మీయ సమ్మేళనంలో కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంత చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వెంకటేష్‌గౌడ్, భువనగిరి మార్కెట్ కమిటీ వైస్‌చైర్మెన్ సత్యనారాయణ, ఆత్మీయ సమ్మేళనం ఇన్చార్జి మచ్చ శ్రీనివాస్‌గౌడ్, మహిళా అధ్యక్షురాలు కవిత, మండల యూత్ ప్రధాన కార్యదర్శి మానుక రాజు యాదవ్, మండల నాయకులు గొడుగు చంద్రమౌళి, బోనం కూర మల్లేశం, శ్రీధర్, శశిధర్ రెడ్డి, ధీరవత్ రమేష్ నాయక్, ఉడతల రాజేష్‌గౌడ్, ఉపసర్పంచ్ దండు యాదగిరి, సుమన్‌నాయక్, పరమేష్‌నాయక్, మాజీ ఎంపీటీసీ వెంకటేష్‌గౌడ్, లక్ష్మారెడ్డి, బాలనర్సింహ,వెంకటేష్, రాజు నాయక్, సోషల్ మీడియా సాయికుమార్, టిఆర్ఎస్ నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు గ్రామ శాఖ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.