Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తమ అవార్డు వెల్లంకి గ్రామ ప్రజలకు అంకితం
- గ్రామ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి
నవతెలంగాణ-రామన్నపేట
గ్రామంలోని ప్రజలందరి శ్రమ ఫలితంగానే వెల్లంకి గ్రామపంచాయతీకి స్వయం సమృద్ధి విభాగంలో రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డు లభించిందని ఇది గ్రామ ప్రజలందరికీ అంకితం ఇస్తున్నానని వెల్లంకి గ్రామ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి అన్నారు. మండలంలోని వెల్లంకి గ్రామపంచాయతీకి రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డు వచ్చిన సందర్భంగా ఆదివారం సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి కి గ్రామ ప్రజలు ఎంపీటీసీ తిమ్మాపురం మహేందర్ రెడ్డి అధ్యక్షతన ఘనంగా పౌర సన్మానం నిర్వహించారు. అవార్డు పొంది గ్రామానికి తిరిగి వచ్చిన సర్పంచ్ ఎడ్ల మహేందర్‌రెడ్డికి గ్రామ ప్రజలు పూలు చల్లుతూ భారీ ర్యాలీ తో స్వాగతం పలికారు. సన్మానం పొందిన అనంతరం సర్పంచ్ ఎడ్ల మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ డబ్బు సంపాదించగానే సరిపోదని ప్రజాసేవ చేయాలని సంకల్పంతోనే రాజకీయాల్లోకి వచ్చానన్నారు.ఇది మహేందర్‌రెడ్డికి వచ్చిన అవార్డు కాదని, ఇది గ్రామ ప్రజలందరి అవార్డు ఆయన అన్నారు. ఈ పౌర సన్మానాల్లో ఎర్రోళ్ల లక్ష్మమ్మ నరసింహ, ఉపసర్పంచ్ రవ్వా అనసూర్య ఇస్తారి, పిఎసిఎస్ చైర్మన్ నంద్యాల బిక్షం రెడ్డి, ఎంపీడీవో జలంధర్ రెడ్డి, గ్రామపంచాయతీ కార్యదర్శి పోలగోని యాదయ్య, బి అర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మందడి ఉదరు రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు ఎడ్ల సురేందర్‌రెడ్డి, మాజీ సర్పంచులు పున్న నరసింహ, సత్తిరెడ్డి, గుత్తా నర్సింహారెడ్డి, పద్మశాలి సంఘం మండల అధ్యక్షులు ఈడెం శ్రీనివాస్, తూటి మురళి, పాశం రామ్‌రెడ్డి, సుదర్శన్‌రావు, ఎడ్ల నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.