Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూదాన్‌పోచంపల్లి
సోమవారం నుండి ప్రారంభమయ్యే పదవ తరగతి పరీక్షలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చీఫ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని మూడు సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు.బాలుర ఉన్నత పాఠశాలలో 200 మంది,బాలికల ఉన్నత పాఠశాలలో 150 మంది,ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 200 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు హాజరుకానున్నారన్నారు.పరీక్షలు రాసే విద్యార్థులు హాల్‌టికెట్లు చూపించినట్లయితే ఆర్టీసీ బస్సులో ఫ్రీ ప్రయాణం చేయొచ్చన్నారు.ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఉదయం 9 గంటల నుండి పరీక్ష కేంద్రాల్లోకి చేరుకోవాలి.9 గంటల నుండి 9:30 వరకు ఓఎంఆర్ షీట్ విద్యార్థులు పూర్తి చేయాల్సి ఉంటుందని, తదుపరి తొమ్మిదిన్నరకు పరీక్షాపత్రాన్ని విద్యార్థులకు అందజేస్తారన్నారు.విద్యార్థులకు మంచినీటి వసతి తో పాటు వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నామని ఉదయం తొమ్మిదిన్నర నుండి 12:30 వరకు పరీక్షలు నిర్వహణ ఉంటుందని చీఫ్ సూపరింటెండెంట్లు శ్రీనివాస్‌రెడ్డి, పురుషోత్తమ్‌రెడ్డి, ప్రసాద్ తెలిపారు.