Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతిపక్షాలకు సవాల్ విసిరిన డీసీసీబీ చైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డి
నవతెలంగాణ-ఆలేరుటౌన్
ఆలేరు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి చూపిస్తాం రండి , అభివృద్ధి చేయకపోతే ముక్కు నేలకు రాస్తా అంటూ ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీచైర్మెన్ గొంగిడి మహేందర్‌రెడ్డి ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు.మండలకేంద్రంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.బురదజల్లే ప్రయత్నం మానుకోవాలన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేసిన నిధుల మంజూరుతో పట్టణ అభివృద్ధికి నడుం బిగించామన్నారు. అభివృద్ధి చేస్తాం అంటుంటే దొంగ దీక్షలు ఎందుకని ప్రశ్నించారు. ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆలేరు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి చెపిస్తాం రండి నేను చెప్పింది అబద్ధం అయితే ముక్కు నేలకు రాస్తాను అని ప్రతిపక్షాలకు గట్టి సవాల్ విసిరారు. దమ్ముంటే సవాళ్లు స్వీకరించాలని ధ్వజమెత్తారు.50 కోట్ల రూపాయలతో ఆలేరు పట్టణ అభివృద్ధి, ప్రతి వార్డులో సీసీరోడ్లు,కొలనుపాకలో కమ్యూనిటీహాల్, సీసీరోడ్లు, సాయిగూడెం రోడ్డులో అండర్ పాస్ దగ్గర బటర్‌ఫ్లై లైట్లు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ కార్యక్రమాల అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఊహకు అందని అభివృద్ధి జరిగితే ప్రతిపక్షాలు కోతి కొబ్బరిచిప్ప దొరికినట్టుగా ఒకట్రెండు సమస్యలను చూపించి విర్రవీగడం సరికాదని హెచ్చరించారు.మరోసారి ఆలేరులో గులాబీ జెండా ఎగరవేసి ప్రజలపై మాకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు.ఈ సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేశంగౌడ్, మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్‌యాదవ్, నార్మల్, మదర్ డెయిరీ డైరెక్టర్ దొంతిరి సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.