Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
బీసీ జనగణ మండల్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని ఎంసీపీఐయూ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా జనరల్ బాడీ సమావేశం ధీరవత్ మోహన్ నాయక్ అధ్యక్షతన మండలంలోని యాద్గర్ పల్లి గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ జనాభాలో సగభాగమున్నా బీసీ లకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుందన్నారు. బీసీ జనగన మండల్ కమిషన్ సిపారసులు కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం 9 సంవత్సరాలుగా మన దేశంలో అమలు చేస్తున్న కార్పొరేట్ మతోన్మాద అనుకూల విధానాలను రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను తక్షణమే విరమించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వస్కుల మట్టయ్య , జిల్లా కార్యదర్శి సైదమ్మ , జిల్లా సహాయ కార్యదర్శి గోపి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాతంగి విశాలాంధ్ర, వస్కుల చంద్రకళ, పోతుగంటి కాశి, వల్లపుదాసు వెంకన్న, రామాంజి జ్యోతి, గుడుగుంట్ల మారయ్య, దీరవత్ లాలు నాయక్, ఈటమళ్ళ లింగమ్మ, గడ్డి వీరయ్య, వల్లమల్ల ఆశీర్వాదం, వస్కుల కిరణ్, బొల్లంపల్లి సైదమ్మ, వల్లపుదాసు యాదయ్య, వస్కుల ఆమని, కందుకూరి మహేష్, పోతుగంటి వేణు, ఎడ్ల సందీప్ తదితరులు పాల్గొన్నారు.