Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భువనగిరి మున్సిపాలిటీలో కౌన్సిలర్ లు రహాస్య భేటీలు
- ఇప్పటికే మూడుసార్లు బేటి అయిన కౌన్సిలర్లు
- చైర్మెన్ రేస్‌లో బీఆర్ఎస్ కౌన్సిలర్ ఖాజా అజీమ్ మోద్దిన్
- కాంగ్రెస్ నుంచి పొత్నక్ ప్రమోద్ కుమార్
నవతెలంగాణ -భువనగిరి రూరల్
యాదాద్రి భువనగిరి జిల్లాలోనీ మొదటగా యాదగిరిగుట్టలో మున్సిపల్ చైర్మెన్ పై అవిశ్వాస తీర్మానం మొదలుపెట్టుగా, ఆలేరు, భువనగిరి, చౌటుప్పల్ మున్సిపల్ చైర్మెన్లకు అవిశ్వాస వేడి తాకింది. యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మెన్హైకోర్టులో స్టే తెచ్చుకోగా , ఆలేరు మున్సిపల్ చైర్మెన్ అవిశ్వాసంపై ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి కౌన్సిలర్లతో చర్చలు జరిపి సద్దుమణిపించారు. చౌటుప్పల్ మున్సిపల్ చైర్మెన్ప్ై అవిశ్వాసం సద్దుమనిగేల స్థానిక కౌన్సిలర్లతో చర్చలు జరిపారు. కాగా భువనగిరి మున్సిపాలిటీలో 2020 జనవరిలో జరిగిన ఎన్నికలలో బీఆర్ఎస్ 15, కాంగ్రెస్ 11, బీజేపీ 7, ఇండిపెండెంట్ ఇద్దరు చొప్పున గెలుపొందారు. కాగా ఇద్దరు ఇండిపెండెంట్లు, బొమ్మాయిపెళ్లికి చెందిన వేణుగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. దీంతో టీిఆర్‌ఎస్ సంఖ్యాబలం 18కి చేరింది. కాగా అవిశ్వాస తీర్మానంపై కలెక్టర్ కు 24 మంది సంతకాలతో కూడిన లేఖను అందజేశారు.
మూడు గ్రామాలు భువనగిరి మున్సిపాలిటీలో విలీనం..... విలీనం వర్సెస్ భువనగిరి....
భువనగిరి మండలంలోని రాయగిరి మేజర్ గ్రామపంచాయతీ తో పాటు, పగిడిపల్లి, బొమ్మాయి గ్రామపంచాయతీలు విలీనం అయ్యాయి. అప్పట్లో మున్సిపాలిటీలో విలీనంను అన్ని గ్రామ పంచాయతీల ప్రజలు వ్యతిరేకించారు. కాగా 2020 జనవరిలో జరిగిన ఎలక్షన్లలో 35 వార్డులకు పోటీ చేయగా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులు గెలుపొందారు. మున్సిపల్ చైర్మెన్ విషయంపై అందరి అభిప్రాయాలను తలకిందులు చేస్తూ భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి రాయగిరి గ్రామపంచాయతీకి మున్సిపల్ చైర్మెన్‌తో పాటు వైస్ చైర్మెన్ పదవి ఇవ్వడంతో బీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి రాజేసుకుంది. కాగా 30 వ వార్డు కౌన్సిలర్ కాజా అజీముద్దీన్ చైర్మెన్ పదవికి పోటీపడ్డాడు. రాయగిరి కి చెందిన ఇద్దరు వ్యక్తులకు చైర్మెన్, వైస్ చైర్మెన్ ఇవ్వడం పై భువనగిరిలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ విషయంపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేసినప్పటికీ అధికార పార్టీ చాకచక్యంగా తిప్పికొట్టింది. కానీ ప్రస్తుతం మూడు సంవత్సరాలు కావడంతో అవిశ్వాస తీర్మానానికి అనుకూల సమయం వచ్చేసింది. అవకాశం కోసం వేచి చూసిన కౌన్సిలర్లు (టి)బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్, బీజేపీ పార్టీలను కలుపుకొని అవిశ్వాస తీర్మానం లేఖను ఫిబ్రవరి 7వ తేదీన కలెక్టర్ కు అందజేశారు. కలెక్టర్ 30 రోజులలో అవిశ్వాస తీర్మానంపై స్పందించాల్సి ఉంది. మార్చి 7తో 30 రోజుల గడువు ముగిసింది. గ్రేస్ పీరియడ్ పది రోజులు సమయం ఉంటుంది. మార్చి 17వ తేదీతో గ్రేస్ పీరియడ్ సమయం కూడా ముగిసింది. కాగా చైర్మెన్‌్ పదవి కోసం బీఆర్ఎస్ నాయకులు ఖాజా అజీముద్దిన్ పోటీలో ముందు వరుసలో ఉండగా, కాంగ్రెస్ మున్సిపల్ పోత్నక్ ప్రమోద్ కుమార్ కూడా చైర్మెన్ పదవి కోసం పట్టుబడుతున్నట్లు సమాచారం. ఏదేమైనా ఈసారి అవిశ్వాస తీర్మానంతో తిరిగి చైర్మెన్, వైస్ చైర్మెన్ పదవులను భువనగిరి వాసులకే దక్కాలని అవిశ్వాస తీర్మానం అందజేసిన మెజార్టీ కౌన్సిలర్లు అభిప్రాయపడుతున్నారు.
అవిశ్వాస తీర్మానంపై కోర్టుకు వెళ్లిన కౌన్సిలర్లు...
భువనగిరి మున్సిపల్ చైర్మెన్ ఏన బోయిన ఆంజనేయులు, వైస్ చైర్మెన్ చింతల కృష్ణయ్య పై పెట్టిన అవిశ్వాస తీర్మానం గడువు ముగియ్యడంతో కలెక్టర్ కార్యాలయం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో కౌన్సిలర్లు కోర్టు మెట్ల ఎక్కారు. కాగా (అవిశ్వాస తీర్మానం పెంపు నాలుగు సంవత్సరాలు ) మున్సిపల్ చట్టం అమలు విషయంపై ఈనెల 10వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ పై వాదనలు జరగనున్నట్లు సమాచారం కాగా ఈ వారం పది రోజుల్లో ఏదో ఒకటి జరుగుతుందని ఆశిస్తున్నారు.
అవిశ్వాస అమలు చేయడానికి మూడు సార్లు సమావేశం.....
ఫిబ్రవరి 7వ తేదీన అవిశ్వాస తీర్మాన లేఖను జిల్లా కలెక్టర్ కు అందజేశారు. అవిశ్వాస తీర్మానానికి ముందు వివేరా హోటల్లో మెజార్టీ కౌన్సిలర్లు (26) రహస్య సమావేశం నిర్వహించారు. అవిశ్వాస తీర్మానం నోటీసు అందజేసిన తర్వాత యాదగిరిగుట్ట లోని హోటల్లో మరొకసారి సమావేశమయ్యారు. మూడోసారి భువనగిరిలోని బీజేపీి కౌన్సిలర్ ఇంట్లో రహస్య సమావేశం జరిపారు. అవిశ్వాస తీర్మానం అమలు చేయకపోవడం విషయంపై అధికారులపై ఒత్తిడి తీసుకొస్తూ, కోర్టును ఆశ్రయించారు. అవిశ్వాస తీర్మానంపై స్టే తీసుకురాకుండా ముందుగానే హైకోర్టులో కేవీటి తీసుకొచ్చారు.