Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం పేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందని మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు.మంగళవారం స్థానిక 43వ వార్డులోని సూర్యాపేట పబ్లిక్స్కూల్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు.అంధత్వ రహిత తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టారని పేర్కొన్నారు.పెద్ద ఆస్పత్రులకు వెళ్లి కంటిపరీక్షలు చేయించుకోలేని నిరుపేదలకు కంటివెలుగు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామాంజులరెడ్డి, కౌన్సిలర్ నామ అరుణప్రవీణ్,బీఆర్ఎస్ నాయకులు సయ్యద్ కరాటి, కరుణ, మెప్మా పీడీ రమేష్‌నాయక్, శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్,జనార్దన్‌రెడ్డి, కంటివెలుగు టీం తదితరులు పాల్గొన్నారు.