Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభివృద్ధి చెందుతున్న తెలంగాణను అడ్డుకుంటున్న బీజేపీ
- మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి
నవతెలంగాణ-చౌటుప్పల్
తెలంగాణ రాష్ట్రానికి సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం మున్సిపల్ కేంద్రంలో మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన మునుగోడు నియోజకవర్గంలోని అన్ని మండలాల ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అభివద్ధి చెందుతున్న తెలంగాణను కేంద్రంలోని మోడీి ప్రభుత్వం అడ్డుకుంటుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి మోడీి వైఖరిని ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. తెలంగాణలో తొమ్మిదేండ్ల కాలంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. తెలంగాణపై కేంద్రం కపట ప్రేమ కనబర్చుతుందన్నారు. బీఆర్ఎస్ను బలోపేతం చేయడానికి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఎంతో అభివద్ధి చెందిందన్నారు. దేశం మొత్తం కేసీఆర్ వైపు చూస్తుందన్నారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాల్లో అమలు కావడం లేదన్నారు. వ్యవసాయరంగానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్తు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఉచిత కరెంట్ వ్యవసాయానికి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. బీజేపీ ప్రజాప్రతినిధులకు చేతనైతే కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకొచ్చి తెలంగాణలో ప్రాజెక్టులు, విద్యాలయాలు ఏర్పాటుచేయాలని డిమాండ్‌చేశారు. ఈ సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర నాయకులు వెన్నెపల్లి వెంకటేశ్వర్రావు, ఎంపీపీలు గుత్తా ఉమాప్రేమ్చందర్రెడ్డి, పల్లె కల్యాణిరవికుమార్గౌడ్, మున్సిపల్ చైర్మెన్లు వెన్‌రెడ్డి రాజు, తోకల చంద్రకళవెంకన్న, జెడ్పీటీసీలు వీరమల్ల భానుమతివెంకటేశ్గౌడ్, పాశం సురేందర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మెన్లు చింతల దామోదర్‌రెడ్డి, జక్కిడి జంగారెడ్డి, బీఆర్ఎస్ మండల, మున్సిపల్ అధ్యక్షులు గిరికటి నిరంజన్‌గౌడ్, ముత్యాల ప్రభాకర్‌రెడ్డి, యువజన విభాగం నాయకులు నారెడ్డి అభినందన్‌రెడ్డి, తొర్పునూరి నర్సింహాగౌడ్, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.