Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండల వ్యాప్తంగా 16 సెంటర్లలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు
- రైతులకు ఇబ్బందులు లేకుండా సెంటర్ల ఏర్పాటు
నవతెలంగాణ - చౌటుప్పల్ రూరల్
యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలు చేయడానికి చౌటుప్పల్ సింగిల్ విండో ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు పీఏసీఎస్ చైర్మెన్్ చింతల దామోదర్ రెడ్డి తెలిపారు. చౌటుప్పల్ మండలంలోని 26 గ్రామ పంచాయతీల్లో, చౌటుప్పల్ మున్సిపాలిటీ తో సహా 16 కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. చౌటుప్పల్ మండలంలోని పంతంగి గ్రామంలో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రం స్థలాన్ని పరిశీలించారు. చౌటుప్పల్, ఎస్ లింగోటం గ్రామాలలో సింగిల్ విండో నిధులతో నిర్మిస్తున్న గోదాం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారం రోజుల్లో ధాన్యం కొనుగోలు చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ ఉన్నతాధికారులతో చర్చించి 16 సెంటర్లలో ధాన్యం కొనుగోలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. గత ఏడాది ఈ సీజన్లో 1.70 లక్షల క్వింటాల్లో ధాన్యం కొనుగోలు చేసినట్లు, ఈ సంవత్సరం రెండు లక్షల క్వింటాళ్ల వరకు ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, రైతుల సౌకర్యార్థం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. రైతులు ప్రవేట్ దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఏ గ్రేడ్ క్వింటాలు ధాన్యానికి రూ.2060, బి గ్రేడ్ క్వింటాలు ధాన్యానికి రూ.2040 ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.