Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రామన్నపేట ఎంపీటీసీ-1 గొరిగే నరసింహ
- క్రీడా ప్రాంగణాలు బోర్డుకే పరిమితమా...!
- సూరారం ఎంపీటీసీ దోమల సతీష్
- పావలా వడ్డీ రుణం తీసుకున్న వారికే వర్తిస్తుంది.
- స్థానిక ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి.
- అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలి
- జెడ్పీటీసీ పున్న లక్ష్మి
- మండల సర్వసభ్య సమావేశానికి సగానికి పైగా ప్రజాప్రతినిధులు డుమ్మా..
నవతెలంగాణ- రామన్నపేట
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకంలో భాగంగా మంచినీరు మా రామన్నపేట ప్రజలకు తాగే మోక్షం లేదా అని రామన్నపేట ఎంపీటీసీ-1 గొరిగే నరసింహ మండల సర్వేసభ్య సమావేశంలో తన ఆవేదనను వ్యక్తం చేశారు. గురువారం స్థానిక మండల పరిషత్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ సమావేశం మందిరంలో ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఎంపీటీసీలు పలు సమస్యలపై సభలో ప్రస్తావించారు. అధికారులు తమ శాఖకు సంబంధించిన అడిగిన ప్రతి ప్రశ్నను నమోదు చేసుకొని, రాబోయే సర్వసభ్య సమావేశంలో పరిష్కరించిన వివరాలను తెలియజేయాలని సూరారం ఎంపీటీసీ దోమల సతీష్ తెలిపారు. క్రీడా ప్రాంగణాలను బోర్డుకి పరిమితం చేస్తున్నారని, ఎలాంటి అభివృద్ధి చేయడం లేదని జనంపల్లి ఎంపీటీసీ వేమవరం సుదీర్ బాబు, సూరవరం ఎంపీటీసీ దోమల సతీష్ సభ దృష్టికి తీసుకొచ్చారు. కొన్నిచోట్ల స్థలము లేకున్న క్రీడా ప్రాంగణాలంటూ బోర్డు పెట్టారని వారన్నారు. ప్రస్తుతం బోర్డులు మాత్రమే పెట్టామని, సర్నేనిగూడెం, శోభనాభపురం గ్రామాలలో క్రీడా ప్రాంగణాలలో క్రీడలకు వీలుగా అభివృద్ధి చేశామని అధికారులు తెలిపారు. ఆర్ అండ్ బి అధికారులు సభకు ఎప్పుడు రావడంలేదని, కొన్ని శాఖల అధికారులు తమ అసిస్టెంట్లను పంపుతున్నారని బాధ్యతగా తీసుకోవడంలేదని వారన్నారు. అలాంటి వారిపై సభ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. రామన్నపేట పట్టణంలో మిషన్ భగీరథ నీరు రావడంలేదని, త్రాగునీరు కొనుగోలు చేసుకుని తాగాల్సిన పరిస్థితి నెలకొందని ఎంపీటీసీ నరసింహ తన ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు చొరవ తీసుకొని మిషన్ భగీరథ నీరు ఇంటింటికి అందించాలని కోరారు. ఎంపీపీ కన్నబోయిన జ్యోతి, జెడ్పీటీసీ పున్న లక్ష్మి మాట్లాడుతూ అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని గ్రామాలలో ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భంలో ప్రజా ప్రతినిధులకు సమాచారం ఇయ్యాలని వారు సూచించారు. సమ భావన సంఘాలలో అప్పులు తీసుకున్న సభ్యులకే ప్రభుత్వం ఇచ్చిన పావలా వడ్డీకి సంబంధించిన నిధులు వర్తిస్తాయని ఈ విషయము సహబాన సంఘాల మహిళలకు విడమర్చి చెప్పాలని వారి అధికారులకు సూచించారు. సర్వసభ్య సమావేశానికి ఆరుగురు ఎంపిటిసిలు, ఏడుగురు సర్పంచులు మాత్రమే హాజరయ్యారు. ఇందులో సగం మంది సమావేశం ప్రారంభమైన గంటకు పైగా ఆలస్యంగా సభకు రావడం విశేషం. సర్వసభ్య సమావేశంపై కొందరు ప్రజాప్రతినిధులు ఆసక్తి చూపినట్లుగా కనిపించడం లేదని పలువురు చర్చించుకోవడం కొసమెరుపు. ఈ సమావేశంలో ఎంపీడీవో జలంధర్ రెడ్డి, తహసిల్దార్ వలిగొండ ఆంజనేయులు, పిఆర్ఏఈ గాలయ్య, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ప్రశాంత్ రెడ్డి, ట్రాన్స్కో ఈ నరసింహ, పీఏసీఎస్చైర్మెన్ నంద్యాల బిక్షం రెడ్డి, ఎంపీటీసీలు గోగు పద్మ, గాదె పారిజాత, సర్పంచులు అంతటి పద్మ, గుత్తా నరసింహారెడ్డి, కోళ్ల స్వామి, బందల యాదయ్య, ఉప్పు ప్రకాష్, రేఖ యాదయ్య, సోమయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ కంభంపాటి శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.