Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొనుగోలుపై తక్షణమే ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలి సీపీఐ(ఎం ) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
యాసంగిలో తక్షణమే వరి పంటను కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికే బోర్ల కింద సాగుచేసిన వరి ధాన్యం కటింగ్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఆయకట్టు ప్రాంతంలో కూడా వరి కోతలు ప్రారంభించినా ప్రభుత్వం నేటికీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంతో రైతులు మధ్య దళారీలకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుందని, యాసంగిలో అకాల వర్షాలతో ఇప్పటికే కొంత పంట నష్టం జరిగిందన్నారు. కొద్దిగా మిగిలిన పంట కటింగ్ చేసిన ధాన్యాన్ని నిలువ చేయడానికి రైతుల వద్ద గోదాములు లేవని, ప్రభుత్వం తక్షణమే అన్ని గ్రామాల్లో ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరల బ్యానర్లను ఏర్పాటు చేయాలని కోరారు. మద్దతు ధరకు కొనుగోలు చేయని వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎంత పంట సేద్యం చేశారో అందుకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించి, నిర్ణయించిన మద్దతు ధరలకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే జిల్లాస్థాయిలో రాజకీయ పార్టీలతో, రైతు సంఘాలతో, మిల్లర్లతో కలిపి సమావేశం ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు.