Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర అధ్యక్షులు గంజి మురళీధర్
నవతెలంగాణ-చండూర్
చండూరు పట్టణ కేంద్రంలో సోమవారం కురిసిన ఈదురుగాలులకు రేకులు లేచి మగ్గాలు, నూలు నష్టపోయిన అంగడిపేట రాజీవ్ కాలనీకి చెందిన చేనేత కార్మికుడు తిరందాసు వెంకటేశం కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ఆరు లక్షల రూపాయలు ఇఛ్చి ఆదుకోవాలని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంజి మురళీధర్ డిమాండ్ చేశారు. గురువారం తిరందాసు వెంకటేశం కుటుంబాన్ని ఆయన పరామర్శించి ఓదార్చారు. అనంతరం చండూరు తహసిల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మురళీధర్ మాట్లాడుతూ ఈదురు గాలుల భారీ వర్షం వలన వెంకటేశం ఇల్లు పైకప్పు రేకులు లేచిపోవడంతో మగ్గం మగ్గంపై ఉన్న పట్టు దారాలు ఇతర సామాన్లు సుమారు 6 లక్షల రూపాయలు నష్టం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే వర్క్ షెడ్డు, ఇల్లు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని, నష్టపోయిన నూలు, రంగులు, రసాయనాలు మగ్గం కొనుగోలు చేసుకోవడానికి తక్షణ సహాయంగా ఆరు లక్షల రూపాయల నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వృత్తి సంఘాల జిల్లా నాయకులు జెర్రిపోతుల ధనంజయ గౌడ్, డిసిసిబి డైరెక్టర్ జూలూరు శ్రీనివాసులు, నర్సింగ్ బట్ల చేనేత సహకార సంఘం అధ్యక్షులు జెల్లా నరసింహ,జిల్లా నాయకులుకర్నాటి వెంకటేశం,చెరుపెల్లి కృష్ణయ్య, తిరందాసు చంద్రశేఖర్, మార్కండేయతదితరులు పాల్గొన్నారు.