Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంట్రాక్టర్ల సమస్యలను పరిష్కరిస్తాను
- మంత్రి జగదీశ్ రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
కాంట్రాక్టర్లు కలిసి కట్టుగా వుండి సూర్యాపేట పట్టణాన్ని అభివృద్ధిలో పదంలో ముందు ఉంచాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు.ఇటివలే మున్సిపల్ కాంట్రాక్టర్స్ అస్సోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికైనా సయ్యద్ జలీల్ పాషా ఆధ్వర్యంలో మున్సిపల్ కాంట్రాక్టర్లు గురువారం స్థానిక క్యాంపు కార్యాలయంలో మంత్రి ని మర్యాద పూర్వకంగా కలిశారు.అధ్యక్షులు గా ఎన్నికైనా జలీల్ పాషా ను మంత్రి ఈ సందర్భంగా శాలువా కప్పి బొకే అందజేసి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సూర్యాపేట పట్టణాన్ని అభివృద్ధి పదంలో ముందు ఉంచడానికి కాంట్రాక్టర్ ల పాత్ర కీలక మైనదని పేర్కొన్నారు. కాంట్రాక్టర్లు అందరూ ఐక్యతగా ఉండి నాణ్యతతో పనులు చేయాలని సూచించారు. అనంతరం కాంట్రాక్టర్లు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొని వెళ్లగా సమస్యల పరిష్కారానికి కృషి చెస్తానని హామీ ఇచ్చినట్టు అధ్యక్షులు జలీల్ పాషా తెలిపారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్లు మంత్రి కి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్లు యూసఫ్ ఖాన్, బాబూజీ రావు ,శ్రీనివాస్ రెడ్డి ,మోత్కూరి సందీప్ ,ఆరిఫ్ ,కృష్ణయ్య ,రాంబాబు తదితరులు పాల్గొన్నారు.