Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే గాదరికిశోర్‌కుమార్
నవతెలంగాణ-నూతనకల్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు ఆత్మీయ సమ్మేళన బలగమే మూడవసారి గెలుపనుకు నాంది పలుకుతాయని తుంగతుర్తి శాసనసభ సభ్యులు గాదరికిషోర్‌కుమార్ అన్నారు.శుక్రవారం మండలకేంద్రంలోని సాయిరాం ఫంక్షన్హాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.రాష్ట్ర అభివృద్ధి కోసం ఏర్పడిన బీఆర్ఎస్ 8 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన అనంతరం దేశాభివృద్ధి కోసం బీఆర్ఎస్ ఏర్పడిందన్నారు.కేసీఆర్ రానున్న రోజులలో అభివృద్ధి కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టనున్నారని తెలిపారు.గత పాలకులకాలంలో ఎడారిగా మారిన తుంగతుర్తి నియోజకవర్గం హత్యలతో రక్తం పారిన ఈ ప్రాంతంలో గోదావరి జలాలతో సస్యశ్యామలమై పంటలు పండుతున్నాయన్నారు.తమ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్, వంటి అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు రానున్న ఎన్నికలలో బీఆర్ఎస్ను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి డైరెక్టర్ ఒంటెద్దు నర్సింహారెడ్డి, భూరెడ్డి కళావతి సంజీవరెడ్డి, జెడ్సీటీపీ కందాల దామోదర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్ కనకటి వెంకన్న, మండలఅధ్యక్షుడు మున్న మల్లయ్యయాదవ్, మండల ప్రధాన కార్యదర్శి బత్తుల సాయిలుగౌడ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు చూడిలింగారెడ్డి, ఎంపీటీసీ పన్నాల రమామల్లారెడ్డి, వైస్‌ఎంపీపీ జక్కిపరమేష్, గార్డుల రజిత లింగరాజు, సీనియర్ నాయకులు గాజుల తిరుమలరావు, తాడూరి లింగయ్య, మోహన్‌రావు పాల్గొన్నారు.