Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్నగర్
మున్సిపల్ మాజీ చైర్మెన్ దొంతగాని శ్రీనివాస్ తల్లి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ దొంతగాని లక్ష్మమ్మను శుక్రవారం ఆధ్వర్యంలో ఘనంగా పూలమాలలు, శాలువాలతో సన్మానించారు.ఈ సందర్భంగా దొంతగాని శ్రీనివాస్ మాట్లాడుతూ మార్కెట్ పరిధిలోని రైతులకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా చూడాలని మార్కెట్ పరిధిలో ఉన్న రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.రైతులు పండించిన ధాన్యాన్ని విలువ చేసుకోవడానికి నూతన గోదాముల నిర్మాణం చేపట్టాలన్నారు.పట్టణ ప్రజలందరి ఆదరాభిమానాలతో చూరగొన్న మాజీ మున్సిపల్ చైర్మెన్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా సన్మానించి మున్ముందు ఉన్నత పదవులు చేపట్టాలని ఆశీర్వదించారు.మున్సిపల్చైర్పర్సన్ లక్ష్మమ్మ మాట్లాడుతూ తమ మార్కెట్ పరిధిలో ఉన్న సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా తన వంతు కృషి చేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో ఆకుల రాము, రాచకొండ వెంకటేశ్వర్లు, రాగి రామాచారి, రాజశేఖర్ ,వేముల శ్రీనివాస్, వట్టికూటి శ్రీకాంత్, చామర్తి నాగాచారి, కల్లూరి జగదీష్, పిన్నెల్లి కోటేశ్వరరావు, ఇందిరాలరాంబాబు, వెంకటేశ్వర్లు, సాయి తదితరులు పాల్గొన్నారు.