Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మునగాల
నియోజవకర్గంలోని అన్ని గ్రామపంచాయతీల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం మండలంలోని నర్సింహాపురం, కోదండరాపురం గ్రామాలలో 40లక్షల రూపాయలతో నూతనం నిర్మించే గ్రామపంచాయతీ భవనాలకు ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే రోడ్లకు మహర్దశ వచ్చిందన్నారు.బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రతి పల్లెపల్లెకు రోడ్లు రావడమే కాకుండా ప్రతి గ్రామంలోనూ అంతర్గత రోడ్లు కూడా వచ్చాయని గుర్తు చేశారు.ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల చేతుల్లో నిరాదరణ, నిర్లక్ష్యా నికి గురైన అనేక గ్రామాలు బీఆర్ఎస్ పాలనలో క్రమక్రమంగా అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎలకా బిందు నరేందర్రెడ్డి, మండల అధ్యక్షులు తోగరు రమేష్, సర్పంచ్ కారంగుల నాగమణి సైదులు, దేవరకొండ రమేష్, వెంకటేశ్వర్లు, ఆకుపాముల సింగిల్ విండో చైర్మెన్ వల్లపురెడ్డి రామిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కనుమర్లపూడి శ్రీనివాసరావు, సత్యనారాయణ, బొమ్మ చిన్నవెంకన్న, సుంకికృష్ణారెడ్డి, నాగేంద్రబాబు, రాంబాబు పాల్గొన్నారు.