Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్పీ రాజేంద్రప్రసాద్
నవతెలంగాణ-కోదాడరూరల్
వాహనదారులు పోలీసులకు సహకరించాలని ఎస్పీ రాజేంద్రప్రసాద్ అన్నారు. శుక్రవారం మండలపరిధిలోని రామాపురం క్రాస్‌రోడ్డు ఆంధ్రా-తెలంగాణ రాష్ట్ర సరిహద్దు పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీలను ఆయన పరిశీలించారు.ఆంధ్రా-తెలంగాణ సరిహద్దు కావడంతో సిబ్బంది తనిఖీలలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం కోదాడ రూరల్ పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ తనిఖీ చేశారు.తనిఖీలలో భాగంగా సిబ్బంది కవాత్‌ను పరిశీలించారు.అనంతరం స్టేషన్లో పలు రికార్డులను ఆయన తనిఖీ చేశారు.అత్యవసర పరిస్థితుల్లో పోలీసు అత్యంత వేగంగా స్పందించి బాధితులకు భరోసా ధైర్యం కల్పించాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. సామాజిక భద్రతలో భాగంగా ప్రజలను పోలీసు పనిలో భాగస్వామ్యం చేయాలని కమ్యూనిటీ కార్యక్రమాల ద్వారా నిత్యం పోలీస్ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.సీసీటీవీ కెమెరాలు ప్రాధాన్యతను అవగాహన కల్పించాలని తెలిపారు.పట్టణ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌ను పరిశీలించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.ఆయన వెంట డిఎస్పి వెంకటేశ్వరరెడ్డి, స్పెషల్ బ్రాంచ్‌ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ నర్సింహ, రూరల్ సీఐ ప్రసాద్, పట్టణ ఇన్స్పెక్టర్ శివశంకర్, ఎస్సైసాయి ప్రశాంత్, సిబ్బంది పాల్గొన్నారు.