Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) ,సీపీఐ జిల్లా కార్యదర్శులు ఎండి.జహంగీర్,గోద శ్రీరాములు
నవతెలంగాణ -యాదగిరిగుట్ట
ఈ నెల 9న హైదరాబాద్లో జరిగే సీపీఐ(ఎం), సీపీఐ రాష్ట్ర సమావేశాన్ని జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శులు ఎండి జహంగీర్, గోదా శ్రీరాములు కోరారు. శుక్రవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో ఉభయ పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ దేశ రాష్ట్ర రాజకీయాల్లో వస్తున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో జరిగే ఉద్యమాలకు పరస్పర సహకారం అందుకొని పనిచేసేందుకు ఈ సమావేశం ఉపయోగపడుతుందన్నారు.ఈ సమావేశాలకు ముఖ్య అతిథులుగా సీపీఐ(ఎం) అఖిలభారత కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీిఐ అఖిల భారత కార్యదర్శి డి.రాజాతో పాటుగా ముఖ్య నాయకులు హాజరవుతారన్నారు. దేశంలో ఉన్న బీజేపీి ప్రభుత్వం మతోన్మాదంతో పాటుగా ప్రభుత్వ రంగ సంస్థలను కార్పోరేట్ లకు ధారాధత్తం చేస్తుంది అని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు టెన్త్ పేపర్ల విషయంలో పార్లమెంట్ సభ్యత్వం తొలగించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఉభయ పార్టీల కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని ప్రజా ఉద్యమాలను ఉదృతం చేసేందుకు ప్రజలను చైతన్యవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇరు పార్టీ ఉద్యమంలో ఐక్యంగా పనిచేసే సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ,బట్టుపల్లి అనురాధ ,జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మంగ నర్సింహులు ,సీపీిఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కళ్లేం కృష్ణ ,బండి జంగమ్మ ,సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు బబ్బురి పోశెట్టి , సీపీఐ జిల్లా కమిటీ సభ్యులు పేరబోయిన మహేందర్, బబ్బురి శ్రీధర్ గోరేటి రాములు ,కల్లేపల్లి మహేందర్ మండల కార్యవర్గ సభ్యులు పేరబోయిన పెంటయ్య ,పట్టణ కార్యదర్శి గోపగాని రాజు ,పేరబోయిన బంగారు తదితరులు పాల్గొన్నారు.