Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
నవతెలంగాణ- భువనగిరిరూరల్
తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి కోరారు. శుక్రవారం మండలంలోని హనుమాపురం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని, మాట్లాడారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఓటరును కలవాలని వారి సమస్యలు బాధలు వినాలని చిన్న చిన్న సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని అన్నారు. గ్రామాల్లో ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పని చేసి పార్టీ బలోపేతానికి కృషి చెయ్యాలని అన్నారు, మీలో ఏమైనా వ్యక్తిగతంగా ఇబ్బందులు ఉంటే స్వయంగా నాకు చెప్పండి, కుటుంబ సభ్యులుగా అందరం కలిసి సమస్య పరిష్కరించుకుందాం, రానున్న ఎన్నికల్లో భువనగిరి మండలం నుండి అత్యధిక మెజారిటీ రావాలని కేసీఆర్ నాయకత్వంలో మనమంతా పని చెయ్యాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీచైర్మెన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి. ఆ పార్టీ జిల్లా ఇన్చార్జి ఎమ్మెల్సీ యాదవరెడ్డి, జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మెన్ జడల అమరేందర్ గౌడ్, ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామి యాదవ్, జెడ్పీటీసీ సుబ్బూరు బీరు మల్లయ్య, వైస్ ఎంపీపీ ఏనుగు సంజీవరెడ్డి, నాయకులు బలుగురు మధుసూదన్ రెడ్డి, ర్యాకల శ్రీనివాస్, మండల అధ్యక్ష కార్యదర్శులు జనగాం పాండు, ఓం ప్రకాష్ గౌడ్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ కంచి మల్లయ్య, సర్పంచులు , ఎంపీటీసీలు వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.