Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విమర్శిస్తున్న సొంత పార్టీ కార్యకర్తలు
నవతెలంగాణ -సంస్థాన్ నారాయణపురం
కాంగ్రెస్ మండల అధ్యక్షుని ఎంపికలో పార్టీ ముఖ్య నాయకుల, కార్యకర్తలను సంప్రదించకుండా చలమల కృష్ణారెడ్డి వ్యవహరిస్తూ ఒంటెద్దు పోకడలకు పోతున్నారని సొంత పార్టీ కార్యకర్తలు విమర్శిస్తున్నారు. గురువారం కాంగ్రెస్ పార్టీకి నూతన మండల అధ్యక్షుని ఎంపిక చేయడంతో సొంత పార్టీ కార్యకర్తలు ఆరోపణలకు పూనుకున్నారు. శుక్రవారం మండల కేంద్రంలో కొంతమంది ముఖ్య కార్యకర్తలు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. చలమల కృష్ణారెడ్డి డమ్మీ ఇన్చార్జిగా అభివర్ణించారు. ఏకపక్షంగా మండల పార్టీ అధ్యక్షున్ని ప్రకటించడం చలమల కృష్ణారెడ్డి ఒంటెద్దు పోకడలకు నియంతృత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు పార్టీ శ్రేణులకు నష్టం కలిగిస్తూ కార్యకర్తల మనోభావాలు దెబ్బసే విధంగా ఉన్నాయన్నారు.ఆరు నెలల క్రితం పార్టీలోకి వచ్చిన కృష్ణారెడ్డి తన సొంత నిర్ణయాలను అమలుపరచుకుంటూ 30 ఏండ్లుగా పార్టీని నమ్ముకుని ఉంటున్న సీనియర్ కు నష్టం కలిగిస్తూ రాజకీయాలను భ్రస్టు పట్టిస్తున్నారని ఆరోపించారు.గ్రూపు రాజకీయాలు చేస్తూ పార్టీని విచ్ఛిన్నం చేస్తున్నారని ఆరోపించారు.కృష్ణారెడ్డికి భజన చేసే వారికే పదవులు కట్టబెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుదీర్ఘంగా పార్టీలో పనిచేస్తున్న నాయకులను పార్టీకి దూరం చేస్తూ భజనపరులకే ప్రాతినిధ్యం ఇస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి చర్యలకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతిఘటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రామ అధ్యక్షులు చిలివేరు కృష్ణ,సీనియర్ నాయకులు చిలుకూరి అంజయ్య,మందుల బాలకృష్ణ, మైలారం రాములు, చిలువేరు నరసింహ, అందే నరేష్ యాదవ్,బైకని నరేందర్ యాదవ్,బోయిని నరసింహ,రత్తుపల్లి యాదయ్య, గుండమల్ల మల్లేష్,మందుగుల దానయ్య,రాచకొండ రమేష్,రాసమళ్ల వెంకటయ్య,చేక్కవిజేరు,చింతల లింగస్వామి, పులమోని నర్సింహ్మ,రాసమళ్ళ వీరస్వామి, చిలువేరుసోమయ్య,ఏర్రోల్ల లింగస్వామి,ఉప్పరగోని నగేష్, దోటిలింగస్వామి,గుత్తా రవీందర్ రెడ్డి, వేము గాలయ్య,ఏడ్ల శీతయ్య తదితరులు పాల్గొన్నారు.