Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
ఈ నెల 18 నుండి మే 5 వరకు సీపీఐ ఆధ్వర్యంలో మునుగోడు నియోజకవర్గవ్యాప్తంగా జిల్లాలోని పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల సాధన కోసం పాదయాత్ర నిర్వహిస్తున్నామని సీపీఐ మునుగోడు నియోజకవర్గ ఇన్ఛార్జీ నెల్లికంటి సత్యం తెలిపారు. శుక్రవారం చౌటుప్పల్ పట్టణకేంద్రంలో ఆ పార్టీ మండల కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హాజరై మాట్లాడారు. కృష్ణా జలాల పంపిణీలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వాటా తేల్చకుండా మన ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేసిందన్నారు. కృష్ణా పరివాహక ప్రాంతం 65శాతానికి పైగా తెలంగాణలో ఉండగా 37శాతం మాత్రమే కృష్ణా జలాల వాటా ఉండడం బాధాకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలుచేయడంలో విఫలం చెందిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను పాదయాత్ర ద్వారా ప్రజలకు వివరిస్తామని తెలిపారు. ఈ నెల 18న చౌటుప్పల్‌లో ప్రారంభమై మే 5న చండూరులో ముగింపు బహిరంగ సభ ఉంటుందన్నారు. ఈ పాదయాత్రలో ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బచ్చనగోని గాలయ్య, ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు కుర్మిద్దె శ్రీనివాస్, సీపీఐ మండలకార్యదర్శి పల్లె శేఖర్‌రెడ్డి, నాయకులు ఎస్ఎ.రహమాన్, వీరస్వామి, ఉడుత రామలింగం, పిల్లి శంకర్, బద్దుల సుధాకర్, కొండూరు వెంకన్న, టంగుటూరి రాములు, నర్సింహా, బిక్షపతి, అంజయ్య, కౌసల్య, యాదయ్య, పాండు, భాస్కర్, కృష్ణ పాల్గొన్నారు.