Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గరిడేపల్లి
మూడేండ్లలో రూ.3.5 వేల కోట్లతో హామీ ఇచ్చిన ప్రతి పనిని, హామీలు ఇవ్వని పనులతో నియోజక వర్గాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నామని ఎమ్మెల్యే శానంపుడి సైదిరెడ్డి అన్నారు.మండలపరిధిలోని కీతవారిగుడెం గ్రామంలో శుక్రవారం జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో భార్యతో కలిసి మాట్లాడారు.బీఆర్ఎస్ హయాంలో అన్ని వర్గాలకు అభివృద్ది జరిగిందన్నారు.నియోజకవర్గంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని పరుగులు పెట్టించి పనిచేస్తున్నామని ప్రజలను ఓట్లు అడిగే అర్హత మాకే ఉంటుందని తెలిపారు.గతంలో 60, 70 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ విధానాలే క్రూరంగా ఉంటాయన్నారు.అభివృద్ధి చేస్తే ప్రజలు పైకి వస్తారని అప్పుడు ప్రజలు నాయకుల దగ్గరకి రారన్నారు.ఎప్పుడు ప్రజల మధ్య గొడవలు పెట్టి పబ్బం గడుపుకున్నారని, ప్రజలను వర్గాలుగా చేసి ఆడుకున్నారని విమర్శించారు. అడుగడుగున్నా కాంగ్రెస్ మూకలు అభివృద్ధిని అడ్డుకుంటున్నా ఏనాడూ వెనక్కు తగ్గలేదని గుర్తుచేశారు.అంతకుముందు గ్రామ కూడలిలో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, పెద్దలు, నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు.