Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి
నవతెలంగాణ-మర్రిగూడ
జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రత్యేక చొరవతో నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో అంతర్గత సీసీ రోడ్లు, డ్రైయినేజీ తోపాటు పలు అభివృద్ధి పనులు శరవేగంగా ముందుకు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం మర్రిగూడ మండల కేంద్రంలో విజయ గార్డెన్స్‌లో నిర్వహించిన ఎర్రగండ్లపల్లి, తిరుగండ్లపల్లి, మర్రిగూడ, దామెర భీమనపల్లి, వట్టిపల్లి ఎంపీటీసీ పరిధి గ్రామాల బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉప ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని త్వరితగా పూర్తి చేపిస్తానని, ప్రజలు అధైర్యపడవద్దన్నారు. కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి బలం అని, అందరూ ఒక బలగంలా ఐక్యమత్యంతో పనిచేసి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ..పార్టీ బలో పేతానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెండు మోహన్‌రెడ్డి, జెడ్పీటీసీ పాశం సురేందర్‌రెడ్డి, మాల్ మార్కెట్ కమిటీ చైర్మెన్ దంటు జగదీశ్వర్, మండల పార్టీ అధ్యక్షుడు తోటకూరి శంకర్, మాజీ ఎంపీపీ అనంతరాజు గౌడ్, వైస్ ఎంపీపీ కట్కూరు వెంకటేశం, రైతుబంధు సమితి కన్వీనర్ బచ్చు రామకృష్ణ, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి అయితగోని వెంకటయ్య,మండల, జిల్లా నాయకులు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.