Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నకిరేకల్
ప్రజల పక్షపాతి, నిజాయితీకి నిలువుటద్దం అమరజీవి నర్ర రాఘవరెడ్డి జీవితం ఆదర్శనీయమని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు కందాల ప్రమీల పేర్కొన్నారు. ఆదివారం స్థానిక నర్ర రాఘవరెడ్డి భవనంలో ఆయన వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యేగా ఆరుసార్లు గెలుపొందిన రాఘవరెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సాగు తాగునీటి సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారని పేర్కొన్నారు. నియోజకవర్గంలో సాగు తాగునీటితో పాటు విద్య, వైద్యం కోసం, పేదలకు ఇండ్లు, ఇళ్ల స్థలాల కోసం కృషి చేశారన్నారు. అన్ని వర్గాల ప్రజా సమస్యలను శాసనసభలో ప్రస్తావించి ప్రభుత్వాన్ని ఒప్పించి వాటి పరిష్కారం కోసం కృషి చేశారన్నారు. కమ్యూనిస్టు సిద్ధాంతం కోసం పోరాటమే మార్గమని కార్యకర్తలకు సూచించిన మహా నాయకుడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల పట్టణ కార్యదర్శులు రాచకొండ వెంకట్‌గౌడ్, వంటేపాక వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీపీ మర్రి వెంకటయ్య, నాయకులు, చెన్నబోయిన నాగమణి, యానాల కృష్ణారెడ్డి, సైదులు, పన్నాల శశికళ, కొప్పుల అంజయ్య, పుట్ట సత్తయ్య, సాకుంట్ల నరసింహ పాల్గొన్నారు.
నార్కట్‌పల్లి : నకిరేకల్ మాజీ శాసనసభ్యులు ప్రజల ఆదర్శనేత నర్రా రాఘవరెడ్డి జీవితం నేటి తరానికి ఆదర్శమని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు శ్రీరామోజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఆదివారం నర్రా రాఘవరెడ్డి ఎనిమిదో వర్థంతి సందర్భంగా నార్కట్‌పల్లి పట్టణంలోని సీపీఐ(ఎం) ఆఫీసులో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి చెరుకు పెద్దులు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు, చింతపల్లి బయన్న కొప్పు శ్రవణ్, సోమనబోయిన సైదులు, భగవంతరెడ్డి, మంద గోపాల్, దండు రవి, ఆమనగంటి ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.
చిట్యాల : ప్రజల పక్షపాతి అమరజీవి నర్రా రాఘవరెడ్డి జీవితం ఆదర్శనీయమని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ అన్నారు. చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో ఆదివారం రాఘవరెడ్డి వర్థంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా నగేష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులుఅవిశెట్టి శంకరయ్య, జిట్ట సరోజ, రూరల్ మండల కార్యదర్శి అరూరి శీను, మండల నాయకులు నారబోయిన శ్రీనివాసులు, శీలా రాజయ్య, రుద్రారపు పెద్దులు, ఐతరాజు నర్సింహ, మేడి సుగుణమ్మ, మెట్టు నర్సింహ, గుడిసె లక్ష్మి నారాయణ, మాజీ సర్పంచ్ బూరుగు క్రిష్ణ వేణి, చింతపల్లి క్రిష్ణయ్య, నర్రా బిక్షం రెడ్డి, కొంపెల్లి రమేష్, సిరిఫంగి యాదయ్య, పర్నె లక్ష్మమ్మ, బూర్గు యాదయ్య తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సీపీఐ(ఎం) జెండాను పార్టీ సీనియర్ నాయకులు గుత్తా లక్ష్మి నర్సింహారెడ్డి ఆవిష్కరించి రాఘవరెడ్డికి నివాళులర్పించారు.
వెలిమినేడు గ్రామంలో
మాజీ ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డి వర్థంతి వెలిమినేడులో సీపీఐ(ఎం) గ్రామశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షలు బొంతల చంద్రారెడ్డి, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఆరూరి శ్రీనులతో కలిసి రాఘవరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బొంతల చంద్రారెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు నెలికంటి నరసింహ, అరూరి శంబయ్య, నాతి వెంకట్రామయ్య, శాఖ కార్యదర్శి పంది నరేష్, ఆరూరి నరసింహ, మామిడి రాములు, రాంరెడ్డి బసవయ్య, సతీరెడ్డి, కిరణ్, చంద్రయ్య, ప్రణీత్, దుర్గయ్య, కందటి ఆదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి రవీందర్ ఆధ్వర్యంలో..
మాజీ ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డి ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఆదివారం నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి దైదా రవీందర్ చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలోని రాఘవరెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిపాటి లక్ష్మీ నరసింహ, గార్లపాటి రవీందర్ రెడ్డివట్టిమర్తి గ్రామ శాఖ అధ్యక్షుడు మేడి శ్రీనివాస్ , గుండ్రంపల్లి ఎంపిటిసి దుబ్బ కుమారస్వామి, వణిపాకల మాజీ సర్పంచ్ కట్టంగూరు మల్లేష్, మండల నాయకులు సత్యం, సిరగోని నరేష్, అంజన పతి, సాయి, రాము కుమార్, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
వట్టిమర్తి గ్రామస్తులు..
చిట్యాలమండలం వట్టిమర్తి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డి వర్థంతి సందర్భంగా గ్రామ ప్రజా ప్రతినిధులు విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ సాగర్ల నరేష్ యాదవ్, అక్కినపల్లి భీష్మచారి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దామనూరి గోపాల్, రాచమల్ల రాంప్రసాద్, మునుగోటి గోపాల్, తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో...
మాజీ ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డి నిస్వార్థ రాజకీయాలు నేటి తరానికి ఆదర్శనీయమని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు దండెంపల్లి సత్తయ్య అన్నారు. నర్రా రాఘవరెడ్డి 8వ వర్ధంతి సందర్భంగా సీపీఐ(ఎం) నల్లగొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో చిట్యాల వట్టిమర్తి గ్రామంలోని ఆయన విగ్రహానికి పూలమాలవేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వట్టిమర్తి మాజీ సర్పంచ్ బూరుగు కృష్ణవేణి విజరుకుమార్, నల్లగొండ పట్టణ కమిటీ సభ్యులు దండెంపల్లి సరోజ, గంజి నాగరాజు, బోడ,యిస్తారి రుద్రాక్ష శేఖర్, సలివొజు సైదాచారి, కనగల్లు మండల కమిటీ సభ్యులు కానుగు లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.
కట్టంగూర్ : మాజీ శాసనసభ్యులు రాఘవరెడ్డి 8వ వర్థంతిని ఆదివారం మండల కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు మురారి మోహన్, చిలుమల రామస్వామి, గడగోజు రవీంద్రచారి, ఉట్కూరు యాదయ్య, దండంపెల్లి శీను, రామకృష్ణ, నాగులపాటి మల్లేష్, పందుల లింగయ్య, ముస్కుమారయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు.