Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ వచ్చాకే వ్యవసాయం పండుగలా మారింది
- మరొకసారి కారుకు అవకాశం ఇవ్వాలి
- మే ఒకటి నుండి ఇంటింటి కార్యక్రమం
- ఆత్మీయ సమ్మేళనంలో జెడ్పీ చైర్మెన్ బండ, ఎమ్మెల్యే కంచర్ల
నవతెలంగాణ-నల్లగొండకలెక్టరేట్
పేదల కడుపు నింపే విధంగా కేసీఆర్ పాలన కొనసాగుతుందని జడ్పీ చైర్మెన్ బండ నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. నల్లగొండలో వన్ టౌన్ పరిధిలోని ఇరవై ఒక్క వార్డులకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం దేవరకొండ రోడ్‌లోని రెడ్డి హాస్టల్ ప్రాంగణంలో ఆదివారం నిర్వహించారు. ఆత్మీయ సమ్మేళనానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడ్డాక తెలంగాణ రాకముందు లోవోల్టేజి సమస్యతో ట్రాన్స్‌ఫార్మర్‌లో మోటర్లు కాలిపోయి, వ్యవసాయ రంగం అస్తవ్యస్తంగా ఉండేదన్నారు. తెలంగాణ వచ్చాక వ్యవసాయం పండుగలా మారిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ నియోజకవర్గం అగ్రస్థానంలో పంటలు దిగుబడి చేసిందని తెలిపారు. కేసీఆర్ సర్కారు అన్ని వర్గాల ప్రజల కడుపులు నింపుకుంటూ పోతుంటే మోడీ ప్రభుత్వం కడుపున కొట్టుకుంటూ పోతుందని విమర్శించారు. నల్లగొండ పట్టణంలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి కేవలం 25 శాతం మాత్రమేనని ఇంకా 70 శాతం పనులు చేయాల్సి ఉందని తెలిపారు. జరుగుతున్న అభివృద్ధి ఇదే రకంగా కొనసాగాలన్న మరిన్ని నిధులు నల్గొండకి రావాలన్న సీఎం కేసీఆర్‌ను మరోసారి గెలిపించాలని తెలిపారు. మే 1వ తేదీ నుండి ప్రతి ఇంటికి, గడపగడపకి భూపాల్ అన్న పేరుతో వస్తున్నానని మరోసారి దీవించి నల్లగొండ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముందు గడియారం చౌరస్తా నుండి రెడ్డి హాస్టల్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్‌వలి, నల్లగొండ మున్సిపల్ చైర్మెన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మెన్ అబ్బగోని రమేష్, సీనియర్ నాయకులు సుంకరి మల్లేష్ గౌడ్, చీర పంకజ్ యాదవ్, కటికం సత్తయ్య గౌడ్, ఫరీదోద్దీన్,కనగల్ ఎంపీపీ ఎస్కే. కరీం పాషా, మాజీ ఆర్వో మాలే శరణ్యరెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, జమాల్ ఖాద్రి, సింగిల్ విండో చైర్మెన్లు అలకుంట్ల నాగారత్నం రాజు, పట్టణ అధ్యక్షులు బోనగిరి దేవేందర్, కార్యదర్శులు, సందినేని జనార్దన్ రావు, కాసం శేఖర్, అన్వర్ షబ్బీర్, జాఫర్, పట్టణ యూత్ కమిటీ అధ్యక్షులు వట్టిపల్లి శ్రీనివాస్ దుబ్బరూప,మామిడి పద్మ,సరోజ,కత్తుల సంధ్య,గాలి రాధిక, పలువురు కౌన్సిలర్లు, ముఖ్యనాయకులు పాల్గొన్నారు.