Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆచార్య హరగోపాల్
నవతెలంగాణ-కోదాడరూరల్
విద్యలో మానవీయ కోణం అవసరం అని ప్రొఫెసర్ హరి గోపాల్, ఐఏఎస్ రిటైర్డ్ చక్రవాణి అన్నారు. ఆదివారం పట్టణ పరిధిలోని కేఎల్ఆర్ ఏవెన్యూలోని తేజ విద్యాలయ జరిగిన విద్యాకార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల్లో ప్రశ్నించే సామర్ద్యం పెంచాలని కోరారు. మహిళలను గౌరవించడం, పిల్లలను అధ్యాపకులు ప్రేమతో విద్య నేర్పటం చేయాలని, సామాజిక సమానత, తోటి వారికి సహాయం చేసే భావజాలం పెంచావని సమకాలీన పాఠశాల విద్యలో మార్పులు సమాజంపై ప్రభావం అనే అంశం మీద మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తేజ విద్యాలయ చైర్మెన్ సోమిరెడ్డి, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.