Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధిష్టానం నుండి స్పష్టమైన హామీ
- పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్న కొంతమంది వెధవలు
- టీపీసీసీ ప్రధానకార్యదర్శి చలమల్ల కృష్ణారెడ్డి
నవతెలంగాణ-సంస్థాన్‌నారాయణపురం
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే టిక్కెట్ అధిష్టానం తనకే ఖరారు చేసిందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చలమల్ల కృష్ణారెడ్డి అన్నారు.ఆదివారం మండలంలోని సర్వేల్ గ్రామంలో ఉమ్మడి గ్రామపంచాయతీ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం, ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.కొంతమంది వెధవలు పార్టీలో ఉంటూనే పార్టీ కార్యకర్తలను తప్పుదోవపట్టించి పార్టీకి వెన్నుపోటు పొడిచేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు.అట్లాంటి వెధవలు మనస్సు మార్చుకొని పార్టీలో కొనసాగాలి..లేదా పార్టీ వీడి వెళ్లిపోవాలని హితవు పలికారు.ఈనెల 30 తర్వాత రాష్ట్రంలో ఎప్పుడైనా సాధారణ ఎన్నికలు రావొచ్చన్నారు.ఇకనుండి తాను మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానన్నారు.ఘర్్ వాపసి కార్యక్రమం పేరుతో ఇతర పార్టీలోకి వెళ్లిన వారిని తిరిగి కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చేందుకు ఇక్కడ నుండే కృషి చేస్తానన్నారు.ఉపఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలను పార్టీలోకి శాలువా కప్పి ఆహ్వానించారు.బీజేపీ,బీఆర్ఎస్ ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేకవిధానాలపై యుద్ధం చేయడానికి తాను సిద్ధంగా ఉంటానన్నారు.వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.అభివృద్ధిలో వెనకబడిన మునుగోడును ముందుకు తీసుకపోయేందుకే తాను వచ్చానన్నారు.గ్యాస్,పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు మోడీ ప్రధాన కారణమన్నారు.పేదల పొట్ట గొట్టి అదాని అంబానీలకు దోచి పెడుతున్నారని విమర్శించారు.పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుక లేకుండా చేసేందుకు రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేశారని తెలిపారు.దేశంలో ఎవరు ప్రశ్నించినా ఇలాగే చేసి ప్రజాస్వామాన్ని ఖూనీ చేసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.ఇందిరమ్మ హయాంలో ఇండ్లు కట్టించి, రోడ్లు వేయించి, భూములు పంచారని ఇందిరమ్మ రాజ్యం రావాలంటే కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఇంటింటికి తిరిగి పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గ్రూప్-1 పేపర్ లీక్ కేసీఆర్ కుటుంబమెడకు చుట్టుకోకుండా ఎస్సెస్సీ పేపర్ లీక్‌ను తెరపైకి తెచ్చారన్నారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ఏపూరి సతీష్, మానుపాటి సతీష్, ఎస్కే షబ్బీర్‌అలీ, రిటైర్ ప్రిన్సిపాల్ చిలకరాజు భిక్షపతి, మునుగోడు మండలఅధ్యక్షులు సురివినర్సింహ, చౌటుప్పల్ అధ్యక్షులు దేవేందర్, సుర్వి నర్సింహాగౌడ్, సర్వేలు ఉపసర్పంచ్ బాలగోనిబక్కులు, జక్కిడి పలు గ్రామ శాఖల అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.