Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
మున్సిపల్ కేంద్రంలోని 9వ వార్డులో అభివృద్ధి పనులకు నిధులు మంజూరుచేయాలని కోరుతూ ఆ వార్డు కౌన్సిలర్ దండ హిమబిందుఅరుణ్కుమార్ ఆధ్వర్యంలో సోమవారం హైద్రాబాద్‌లోని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని తన నివాస గృహంలో కలిసి వార్డు ప్రజలు వినతిపత్రం అందజేశారు. వార్డులో సీసీ రోడ్లు, అంతర్గత మురుగుకాల్వలు, స్మశానవాటిక అభివృద్ధికి సంబంధించి నిధులు మంజూరుచేయాలని కోరారు. రజక కులస్తులకు మంజూరైన కమ్యూనిటీ భవనం, దోబిఘాట్ నిర్మాణ పనులు ప్రారంభించాలని కోరారు. ఎమ్మెల్యే స్పందించి అభివృద్ధి పనులకు నిధులు మంజూరుచేస్తానని హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ మాజీ ఛైర్మన్ బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి, వార్డు ప్రజలు భీమగోని శ్రీరాములుగౌడ్, రెడమోని మల్లేశ్, సుర్కంటి బలరామ్‌రెడ్డి, కొలను రామదాసు, మాలి భాస్కర్‌రెడ్డి, మలిగె బాలకృష్ణ, దేవరకొండ స్కైలాబ్చారి, నర్సింహా, సైదులు, సత్యం, లింగస్వామి, జంగయ్య, సాయి, బాలకృష్ణ పాల్గొన్నారు.