Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భువనగిరిరూరల్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కోమటిరెడ్డి మోహన్‌రెడ్డి అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు దామోదర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నగదు రహిత వైద్య సౌకర్యం కల్పించాలని, పెండింగ్‌లో ఉన్న మూడు డీఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ పమేలా సత్పతికి వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రేకల ఆనందం, యూనిటీ అధ్యక్షులు తాడూరి కిష్టయ్య, సిహెచ్ మల్లయ్య, ఆంజనేయ పంతులు, శంకరయ్య, రామ్ రెడ్డి, లక్ష్మారెడ్డి, యాదిరెడ్డి, సత్తయ్య , జిల్లా కార్యవర్గ సభ్యులు యూనిట్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.