Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
అర్జీదారుల నుండి ప్రజావాణిలో వచ్చి దరఖాస్తులను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ పాటిల్ హేమంత కేశవ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుండి ఆయన అర్జీలను స్వీకరించారు.పెన్షన్లు, భూ సమస్యలపై వచ్చిన విన్నపాలను ఆన్లైన్ ద్వారా తహసీల్దార్లతో మాట్లాడి పరిష్కరించారు.ప్రజావాణి అనంతరం కలెక్టర్ ఎస్ వెంకట్రావు, అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్ వేబిక్స్ ద్వారా అంబేద్కర్, జ్యోతిబాపూలే జయంతి వేడుకలపై సంబంధిత అధికారులతో చర్చించారు.హైదరాబాద్ నందు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో నుండి 300 మంది ప్రజలు పాల్గొనేలా పకడ్బందీ ఏర్పాట్ల గురించి కలెక్టర్ తహసీల్దార్లు,ఎంపీడీవోలను అడిగి తెలుసుకున్నారు.రైతులకు ఇబ్బందుల్లేకుండా యాసంగి వరి ధాన్యం కొనుగోలుకేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.డీఆర్డీఏ, డీసీఓ, మెప్మా అధికారులు చేస్తున్న ఏర్పాట్లను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.మండలాలలో తహసీల్దార్, ఏపీఎం, సీసీలు, ధాన్యం కొనుగోలుకేంద్రాలను పరిశీలించాలని,అలాగే డివిజన్ స్థాయిలో ఆర్డీఓ, డీపీఎం, ఏఓలు, జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్,డీఆర్డీఓ, డీఏఓలు పర్యవేక్షిస్తారని తెలిపారు.వ్యవసాయ అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు తెచ్చిన ధాన్యాన్ని నాణ్యతను పరిశీలించాలని పేర్కొన్నారు.గన్నీ బ్యాగుల కొరత లేకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు.పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నందుకు సంబంధిత అధికారులను కలెక్టర్ అభినందనలు తెలిపారు.జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూకు 20 దరఖాస్తులు,డీఆర్డీఓ పీడీకి 3,టీడబ్ల్యూఓ 2,జీజీహెచ్2, పోలీస్ శాఖకు 1, కలెక్టరేట్‌కు 8, మొత్తం 36 దరఖాస్తులు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజేంద్రకుమార్, కలెక్టరేట్ ఏవో శ్రీదేవి, డీఆర్డీఏ పీడీ కిరణ్‌కుమార్, జెడ్పీ సీఈఓ సురేష్,డీపీఓ యాదయ్య, సీపీఓ వెంకటేశ్వర్లు, జిల్లా పశు వైద్యాధికారి డి.శ్రీనివాస్‌రావు, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.