Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్పంచ్, జీపీ, కార్యదర్శికి ఘనసన్మానం
- అదనపు కలెక్టర్ పాటిల్హేమంత కేశవ్
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
జిల్లాలో మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నామని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పాటిల్హేమంత కేశవ్ అన్నారు.సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో గ్రామంలో మహిళ చైతన్యానికి ఎనలేని కృషి చేసిన సందర్బంగా జాతీయ స్థాయిలో మహిళా స్నేహ పూర్వక పంచాయతీ కింద అవార్డు అందుకున్న ఏపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ సానబోయిన రజిత, కార్యదర్శి ఎలక ఉమారాణిలను జెడ్పీ సీఈఓ సురేష్, డీపీఓయాదయ్య, డీఆర్డీఏ పీడీ కిరణ్కుమార్లతో కలిసి పుషగుచ్ఛాలు అందచేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్బంగా ఆదనవు కలెక్టర్ మాట్లాడుతూ పట్టణాలకు పోటీగా గ్రామాలు అభివృద్ధిపథంలో నడుస్తున్నాయని, గ్రామాభివృద్దే దేశాభివృద్ధి అని అన్నారు.మహిళలు అన్ని రంగాలలో రాణించేందుకు గ్రామసభలో తీసుకున్న నిర్ణయాలు, పాఠశాలలో బాలిక 100 శాతం నమోదు , మహిళ గౌరవ ప్రాతినిధ్యం, మహిళస్వయం నిర్ణయ శక్తి పెంపొందించడం అలాగే మహిళ ఆర్ధిక స్వాలంభన పెంపొందించుట, బాలికల యొక్క ఆత్మ రక్షణ అలాగే కేంద్ర, రాష్ట్ర పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయడం తదితర అంశాలపై మహిళలను చైతన్య వంతులను చేయడంతో ఏపూరు జీపీకి జాతీయ స్థాయిలో మహిళా స్నేహ పూర్వక పంచాయతీ అవార్డు లభించిందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.