Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నూతనకల్
మండలపరిధిలోని ఎడవెల్లిలో గ్రామంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గాజుల తిరుమలరావు తమ సొంత ఖర్చులతో నిర్మాణం చేపట్టే బతుకమ్మ ఘాట్ మెట్లు పనులను సర్పంచి కొచ్చర్ల బాబుతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెరువు పక్కనే ఉన్న సీతారామ ఆలయంకు వచ్చే భక్తులు స్నానం చేయడానికి ఇబ్బందికరంగా ఉండడంతో పాటు బతుకమ్మ పండుగ సమయంలో బతుకమ్మను వదిలిపెట్టడం కోసం శాశ్వతంగా ఉండే మెట్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీఏర్పుల నరేష్,గ్రామ శాఖ అధ్యక్షులు బొడ్డువెంకన్న, బయ్య లింగయ్య,దాసరి బాబూరావు, సందజ్యోతి పాల్గొన్నారు.