Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నూతనకల్
రబీసీజన్లో ఏర్పాటు చేయనున్న ధాన్యపు కొనుగోలుకేంద్రాలలో ఎటువంటి అవకతవకలు జరగకుండా సజావుగా కేంద్రాలను నిర్వహించాలని తహసీల్దార్ జమీరుద్దీన్ ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు సూచించారు.సోమవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ధాన్యం కొనుగోలునిర్వాహకులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వం నిర్ణయించిన తూకం ప్రకారం. తేమ శాతం ప్రకారం రైతుల సీరియళ్లను అనుసరించి కొనుగోలును వేగవంతం చేయాలన్నారు.త్వరలో కేంద్రాలను ప్రారంభించేందుకు సంసిద్ధం కావాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయశాఖ అధికారి మురళి,ఏపీఎం కర్నాకర్, పీఏసీఎస్ సీఈఓ సంపేట వెంకయ్య, ఏఈఓలు, సీసీలు, వీబీకేలు తదితరులు పాల్గొన్నారు.