Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇది హత్య కాబడిన నవీన్ కథ
- దళితుడనే హత్యకు ప్లాన్
- పోలీసుల అదుపులో... నిందితులు?
నవతెలంగాణ - నిడమానూరు
వారు ఇద్దరు ఓకే గ్రామస్తులు చిన్నపటి నుండి తెలిసిన ముఖాలు. కులాల కుంపటి ఒకటుందని వారికి ఆ వయస్సులో తెలియదు. రాష్ట వ్యాప్తంగా ఆదివారం నల్గొండ జిల్లా నిడమానూరు మండల పరిధిలోనీ గుంటిపల్లి గ్రామంలో జరిగిన కుల దురహంకార హత్యా గురుంచి అందరికీ తెలిసిన విషయమే. అయితే త్రిపురారం మండలం జీఅన్నారం గ్రామానికి చెందిన ఇరుగు నవీన్ (22) ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం అదే గ్రామానికి చెందిన బీసీ సామాజిక వర్గానికి చెందిన యువతితో నవీన్ గత నాలుగేండ్ల ఎండ్ల కాలం నుండి ప్రేమలో ఉన్నాడు. అయితే ఇక్కడ నవీన్ ఆ యువతితో ప్రేమలో ఉన్నప్పటి సమయానికి అతనికి కేవలం 18 ఎండ్లు కాగా ఆ యువతికి కేవలం 16 ఏండ్లు మాత్రమే. నవీన్‌కు చదువు అబ్బాక పోగా మిర్యాలగూడ లోని ఒక కార్ మెకానిక్ షేడ్‌లో పని చేస్తున్నాడు. ఆ యువతి మాత్రం మిర్యాలగూడ లోనే ఓ కాలేజీలో ఇంటర్ మీడియెట్ ఈ ఏడాది పుర్తి చేసింది. గత నాలుగేండ్లుగా ఇద్దరు ప్రేమలో ఉండడం అమ్మాయి తల్లిదండ్రులకు నవీన్ దళితుడు కావడం వీరి ప్రేమ వ్యవహారం నచ్చలేదు. తమ బిడ్డను మర్చిపోవాలని ,లేకపోతే చంపుతామని నవీన్‌ను అనేక సార్లు హెచ్చరించారు. అయినప్పటికీ నవీన్‌లో మార్పు రాకపోవడంతో ఎలాగైన నవీన్ అంతమొందించాలని ప్లాన్ వేసిన కుటుంబ సభ్యులు ఆదివారం నవీన్ గింటిపల్లిలో ఉన్నాడని తెలుసుకొని అక్కడికి వెళ్లి నవీన్‌ను కత్తితో పొడిచి చంపారు. సోమవారం నవీన్ మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం తన స్వగ్రామానికి మృతదేహాన్ని తీసుకొచ్చారు. గ్రామంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు మధ్య మృతదేహాన్ని ఖననం చేశారు.
పోలీసుల అదుపులో... నిందితులు?
నవీన్‌ను హత్యా చేయాలని అదును కోసం చూస్తున్న అమ్మాయి బంధువులు గింటిపల్లిలో ఉన్నాడన్న సమాచారంతో మూడు ద్విచక్ర వాహనాలపై సుమరు 9 మంది కర్రలు కత్తులతో అక్కడికి చేరుకొని అతి దారుణంగా వెంబడించి పొడిచి చంపారు. అయితే వీరంతా అక్కడ నుండి పరిపోయినప్పటికీ ఓ రాజకీయ నేత సలహాతో పోలీసులకు లొంగిపోయినట్టు విశ్వసనీయ సమాచారం. దళితుడే కారణంగా హత్యకు పాల్పడిన నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని దళిత సంఘాల ఆధ్వర్యం లో సోమవారం నిరసన వ్యక్తం చేశారు. మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి అధ్వర్యంలో కేసును వేగంగా దర్యాప్తు చేపడుతున్నారు.