Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కులమతాలకతీతంగా అభివృద్ధి చేయడమే మంత్రి జగదీశ్‌రెడ్డి మార్క్
- ఇఫ్తార్ విందులో మున్సిపల్ వైస్‌చైర్మెన్ పుట్టా కిశోర్
నవతెలంగాణ-సూర్యాపేట
ప్రజలు ఏదైనా కావాలని అడిగితే అది కోటి రూపాయల పని అయినా క్షణాల్లో మంజూరు ఇచ్చి రోజుల్లో పనులు పూర్తి చేసిన ఘనత రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డికి దక్కుతుందని మున్సిపల్ వైస్‌చైర్మెన్ పుట్ట కిషోర్ అన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి 22వ వార్డులోని బిలాల్ మసీద్ వద్ద ముస్లిం సోదరులకు ఇచ్చిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొని మాట్లాడారు.బర్లపెంట బజార్ చరిత్రలో ఎవరు ఇవ్వని విధంగా బిలాల్ మసీద్‌కు సీసీరోడ్డును ఏర్పాటు చేయడమే కాకుండా మసీదు అభివృద్ధికి ఎలాంటి పనులు కావాలన్నా సహకరిస్తానని హామీ ఇచ్చింది మంత్రి మాత్రమేనన్నారు.గత ప్రభుత్వాల హయాంలో ముస్లిం మైనార్టీలను పట్టించుకున్న నాథుడే లేడన్నారు.నేడు కులమతాలకతీతంగా ఎవరికి ఏం కావాలో ముందే తెలుసుకొని పరిష్కరిస్తున్న గొప్ప నాయకుడు మంత్రి జగదీశ్‌రెడ్డి అని కొనియాడారు. వందమంది వస్తారు వంద రకాలుగా చెబుతారు గతానికి ఇప్పటికీ తేడాను ప్రజలు గమనించాలన్నారు.ఈ మసీదు వద్ద ఇంత పెద్ద ఎత్తున ఇఫ్తార్ విందు ఇచ్చిన దాఖలాలు గతంలో లేవని అది మంత్రికే సాధ్యమైందన్నారు.ముస్లిములు అన్నదమ్ముల్లాగా ఉందామని మీకు ఏ ఆపద వచ్చినా మేమున్నామని హామీ ఇచ్చారు.అనంతరం ముస్లిం సోదరులకు పండ్లు తినిపించి ఉపవాస దీక్షను విరమింప చేశారు.ఈ కార్యక్రమంలో మంత్రి వ్యక్తిగత కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, ఉర్డుఘర్చైర్మెన్ సయ్యద్, కౌన్సిలర్ తాహేర్‌పాషా, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు రియాజుద్దీన్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సవరాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి బుర బాలసైదులు, ఉపాధ్యక్షుడు చాంద్ పాషా,తాహెర్, రఫీ, సయ్యద్ సలీం, సోషల్ మీడియా ఇన్చార్జి నజీర్, గౌస్‌మహమ్మద్, వార్డు ముస్లిం పెద్దలు మన్సూర్, బాబ, సొందు తదితరులు పాల్గొన్నారు.