Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నవతెలంగాణ-నకిరేకల్
నకిరేకల్ పురపాలిక ప్రధాన రహదారి విస్తరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అధికారులను కోరారు. సోమవారం రహదారి విస్తరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విస్తరణ పనులకు స్థానిక దుకాణాల యజమానులు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. అభివృద్ధిలో నకిరేకల్ను ఆదర్శంగా తీర్చిదిద్దే కృషిలో భాగస్వాములు కావాలని కోరారు. విస్తరణలో భాగంగా రహదారిపైకి వచ్చిన దుకాణాలు, ఇళ్ల శ్లాబుల ముందు భాగాలను తొలగించేందుకు పుర సిబ్బందికి, విస్తరణ పనుల కాంట్రాక్టర్ సిబ్బందికి వ్యాపారస్తులు సహకరించాలని కోరారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.