Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ ఆధ్వర్యంలో ధర్నా
- కుటుంబ సభ్యులకు పరామర్శ
నవతెలంగాణ-మిర్యాలగూడ
తక్కువ కులం వాడు మా అమ్మాయిని ప్రేమిస్తాడా అని తాళ్ల జ్యోతి బంధువులు మర్రి రాజు మరికొంతమంది కలిసి ఇరిగి నవీన్‌ను కాపుకాసి వెంటాడి అత్యంత దారుణంగా కత్తులతో గుండెల్లో పొడిసి చంపిన నిందితులను కఠినంగా శిక్షించాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాలడుగు నాగార్జున, సామాజిక వేత్త డాక్టర్ రాజు, ఎస్సీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మాడుగుల శ్రీను, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీను డిమాండ్ చేశారు. మిర్యాలగూడ తాలూకా ఆస్పత్రిలో బాధిత కుటుంబాన్ని సోమవారం పరామర్శించి మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరిని కలిసి కఠినంగా శిక్షించాలని కోరారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన, ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇరిగి నవీన్‌ను హత్య చేసిన నిందితులను ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇరిగి నవీన్ కుటుంబానికి 20 లక్షల ఎక్స్‌గ్రేషియా, డబల్ బెడ్ రూమ్ ఇళ్లు, మూడెకరాల భూమి, ప్రభుత్వ ఉద్యోగం కుటుంబంలో ఒకరికి ఇవ్వాలన్నారు. పరామర్శించిన వారిలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను, రాష్ట్ర కమిటీ సభ్యులు పరుశరాములు, ఎమార్పీఎస్ జిల్లా నాయకులు తోల్కొప్పుల శ్రీను, దళిత సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పోలే రవి, జిల్లా ఉపాధ్యక్షులు కోడిరెక్క మల్లన్న, దేవయ్య, పాపారావు, బొంగురాల వెంకన్న, కోటేష్, పూలమ్మ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు మచ్చ ఏడుకొండలు, తలకొప్పుల సైదులు, దళిత సంఘాల నాయకులు రవి, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కోడిరెక్క మల్లయ్య, దైద దేవయ్య, బొల్లెపల్లి పాపారావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు రేమడాల బిక్షం తదితరులు పాల్గొన్నారు.