Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెడ్పీచైర్మెన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి
నవతెలంగాణ -భువనగిరి రూరల్
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను సద్వినియోగం చేసుకోవాలని జెడ్పీచైర్మెన్్ సందీప్ రెడ్డి అన్నారు. మంగళవారం జెడ్పీ కార్యాలయంలో ఆయన సీఎంఆర్ఎఫ్ చెక్కులను భువనగిరి మండలం వీరవల్లి గ్రామస్తులు ఎస్.శంకరయ్య 55,500, బసవపురం గ్రామస్తులు ఎన్ లక్ష్మి 12,000, ఆత్మకూర్ మండలం కపురాయిపల్లి గ్రామస్తులు డి సుశీల గారి 36,000 లు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీబీనగర్ సింగల్ విండో చైర్మన్ మెట్టు శ్రీనివాస్ రెడ్డి, గూడూరు సర్పంచ్ గడ్డం బాల్ రెడ్డి , నారాల వెంకటస్వామి యాదవ్, బచ్చు వెంకటేష్, కృష్ణా రెడ్డి, పాండు పాల్గొన్నారు.