Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్‌కు కొందరి సభ్యుల ఫిర్యాదు
- బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ విచారణ కొనుగోలుదారునిపై కేసు నమోదు
నవతెలంగాణ -ఆలేరురూరల్
సొసైటీ భూమి స్వాహా చేసిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొల్లూరు గ్రామంలో జరిగింది 2003 2004 సంవత్సరంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ హయాంలో సీఎం చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో కోటివరాల స్కీం పేరుతో గొర్ల కాపరుల సొసైటీ శ్రీ మల్లికార్జున షిప్ బి డింగ్ కోఆపరేటివ్ సొసైటీకి కొల్లూరు రెవిన్యూ పరిధిలోని సర్వేనెంబర్ 980 981లో ఐదు ఎకరాల భూమిని కేటాయించారు. ఈ మధ్యకాలంలో భూముల రేట్లు అమాంతంగా పెరగడంతో ఆ కమిటీకి చెందిన సభ్యులు ఆ భూమిని ఆలేరు పట్టణానికి చెందిన ఓ రియాల్టర్ వ్యాపారికి విక్రయించారు. సొసైటీలో మొత్తం 88 మంది సభ్యులు ఉండగా 84 మంది సభ్యులు ఈ భూమిని విక్రయించేందుకు ఒప్పుకున్నారు. మిగిలిన నలుగురు ఒప్పుకోకపోగా సొసైటీకి సంబంధించిన భూమిని అమ్మడానికి వీలు లేదని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
ఎకరానికి రూ.40 లక్షలు
ఎకరానికి రూ.40 లక్షల చొప్పున ఐదు ఎకరాలకు రెండు కోట్లు ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నారు అనంతరం సొసైటీ సభ్యులను ఒప్పించడానికి ఒక్కొక్కరికి 50 వేల రూపాయల చొప్పున ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. సొసైటీలో 84 మంది మెంబర్లకు ముందుగానే రూ.42 లక్షలు చెల్లించినట్లు సమాచారం మార్చి 27న శ్రీ మల్లికార్జున షిప్ బీడీ గ్ కోపరేటివ్ సొసైటీ పేరుతో ఉన్న ఐదు ఎకరాల భూమి ఆలేరు తహసీిల్దార్ కార్యాలయంలో ఒక రియల్ టార్కు రిజిస్ట్రేషన్ చేస్తే అందుకు సంబంధించిన పాసు బుక్కు కూడా వచ్చినట్టు సమాచారం.
కలెక్టర్‌కు ఫిర్యాదు
సొసైటీ మెంబర్ల మధ్య ఒప్పందం కుదరక ఇద్దరు సభ్యులు మార్చి మొదటి వారంలో కలెక్టర్ పమేలా సత్పతికి ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్‌ను ఆదేశించారు. కొల్లూరు గ్రామంలో సొసైటీ మెంబర్ల్లను ఆలేరు రెవెన్యూ స్టాప్‌ను కలిసి విచారణ చేపట్టిన అధికారి నివేదికను కలెక్టర్‌కు అందజేశారు ఈ క్రమంలో సొసైటీ భూమి విక్రంపై భువనగిరి ఆర్డీవో భూపాల్ రెడ్డి ఎంక్వయిరీ చేశారు.
ఫిర్యాదు చేసిన వ్యక్తులపై కుల బహిష్కరణ.
ఫిర్యాదు చేసిన సభ్యులను మిగిలిన సొసైటీ సభ్యులు తమపై ఫిర్యాదు చేస్తావా అంటూ బెదిరిస్తూ కుల బహిష్కరణ చేశారు. వారిని ఎలాంటి శుభకార్యాలకు పిలవకపోవడం, వారితో ఎవరు కూడా మాట్లాడకపోవడం వారిని భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది .దీనిపై విచారణ చేపట్టిన అధికారులు ఐదు ఎకరాల భూమిని సొసైటీ కి ఉంటుందని తెలిపారు.
వ్యవసాయ భూముల దగ్గరికి రానివ్వడం లేదు
గాజుల యాదగిరి బాధితుడు
వ్యవసాయం చేయాలంటే గ్రామంలో కూలీలు అవసరం అందుకు 5 ఎకరాల భూమి అమ్మకూడదని ఆరోపణ చేయడంతో గ్రామంలో ఉండే కూలీలను కూడా వ్యవసాయ బాయి దగ్గరికి రానివ్వడంలేదు. గ్రామంలో ఎవరు కూడా మాట్లాడొద్దు అని ముక్కుసూటిగా చెప్పారు. శుభకార్యాలకు రానివ్వకపోవడం బాధాకరంగా ఉంది.
కులం లోకి రానివ్వడం లేదు
గాజుల మల్లయ్య బాధితుడు
5 ఎకరాల భూమి కాజేస్తున్నారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో కులంలో శుభకార్యాలకు రానివ్వడం లేదు. ఎవరితో మాట్లాడొద్దని గ్రామంలో చెప్పడం బాధాకరంగా ఉంది.
ఐదు ఎకరాల భూమి కొనుగోలు చేసిన
వారిపై కేసు నమోదు
ఎస్ఐ ఇద్రిస్ అలీ
5ఎకరాల భూమి కొనుగోలు చేసిన రియల్ ్ వ్యాపారి అతనికి సహకరించిన వారిపై విచారణ చేపట్టి బీసీ కార్పొరేషన్ అధికారుల ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ 80/2017 కింద కేసు నమోదు చేశామని ఆలేరు ఎస్ఐ ఇద్రిస్ అలీ. తెలిపారు.