Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ అలుగుబల్లి నర్సిరెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
తెలంగాణ ఆల్ పెన్షనర్స్,రిటైర్డ్ పర్సన్స్ ఐకమత్యంగా ఉండి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని ఎమ్మెల్సీ అలుగుబల్లి. నర్సిరెడ్డి అన్నారు.మంగళవారం స్థానిక కిరాణం అండ్ మర్చంట్ అసోసియేషన్ భవనంలో జరిగిన తెలంగాణ ఆల్ పెన్షనర్స్,రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ద్వితీయ మహాసభలకు ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు.పెన్షనర్స్‌కి జీతాలు, డీఏలు సకాలంలో చెల్లించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పాలకుర్తి కృష్ణమూర్తి, ఉపాధ్యక్షులు అరుణ,సీతారాము, సోమయ్య,రవికుమార్, శ్రీనివాస్‌రావు, కనకమల్లు, బొమ్మిడి లక్ష్మీనారాయణ,రంగయ్య, సోమయ్య,అనిల్‌కుమార్, యాదగిరిరావు,రాంబాబు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.