Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అర్వపల్లి
ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా అధికారులు చూడాలని ఎంపీపీ మన్నె రేణుక లక్ష్మీనర్సయ్యయాదవ్,జెడ్పీటీసీ దావుల వీరప్రసాద్యాదవ్ అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల సమస్యపై అధికారులు సక్రమంగా ఉండే పని చేయాలన్నారు.సమావేశం దృష్టికొచ్చిన సమస్యలు మళ్లీ పునరావతం కాకుండా చూడాలన్నారు. ప్రభుత్వం అందజేసే రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా పశు వైద్యాధికారితో మాట్లాడుతూ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో లబ్ది పొందే గొర్రెల మేకల పెంపకం దారుల వివరాలను మండల వ్యాప్తంగా ఆన్లైన్ చేయకపోవడం వల్ల 581మంది లబ్దిదారులకు అన్యాయం జరుగుతుందన్నారు. గత వైద్యాధికారులు ఆన్లైన్ చేయని తప్పిదం వల్ల నష్టం జరిగిందని, ఉన్నతాధికారుల దష్టికి తీసుకెళ్లి, న్యాయం జరిగేలా చూస్తానని పశు వైద్యాధికారి డాక్టర్ అర్జున్ తెలిపారు.యాసంగి వరి కోతలు ప్రారంభ అవుతున్న సందర్భంగా త్వరలో, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్న సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు , రైతులకు,హమాలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను ఏఎన్ఎం, ఆశా కార్యకర్తల ద్వారా అందించాలని సూచించారు. వ్యవసాయ అధికారులు రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు నాణ్యమైన ధాన్యమును తీసుకువచ్చి రైతులకు ప్రభుత్వం అందించే ఉత్తమ ధరను అందేలా చూడాలన్నారు రామన్నగూడెం గ్రామానికి మిషన్ భగీరథ పైపులైన్ పూర్తి కానుందన, త్వరగా పూర్తి చేయాలని కో ఆప్షన్ సభ్యులు కోరారు. మత్స్యకారుల సభ్యత్వ నమోదు కార్యక్రమం, చెరువుల నిర్వహన గురించి సభ దష్టికి తీసుకు వచ్చారు. ఇటీవల వైరల్ అయిన మిషన్ వాత్సల్య కార్యక్రమం గురించి ప్రశ్నించగా, ప్రభుత్వం నుంచి ఎటువంటి మార్గదర్శకాలు జారీ కానందున దరఖాస్తులను స్వీకరించడం లేదని సీడీపీవో శ్రీజ తెలిపారు వివిధ శాఖలు చెందిన అధికారులు ప్రగతి నివేదికను చదివి వినిపించారు . ఈ కార్యక్రమంలో , వైస్ ఎంపీపీ మారిపెద్ది భవానీశ్రీనివాస్ గౌడ్, ఎంపీడీవో ఉమేష్, ఎంపీవో ఉపేందర్, నాయబ్ తహశీల్దార్ కంట్లమయ్య, వ్యవసాయ అధికారి శరత్ చంద్రారెడ్డి, పంచాయతీరాజ్ డీఈ కొండయ్య, ఏఈ మహేష్, శ్రీకాంత్ సీహెచ్వో చరణ్, ఏపీఎం మల్లేష్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.