Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండకలెక్టరేట్
కుల, వర్గ, వర్ణ వివక్షలతో కూడిన నాటి సమాజంలో రుగ్మతలను దూరం చేసేందుకు చదువు ఒక్కటే సరైన మార్గం అని గుర్తించి ఆ దిశగా అకుంఠిత దీక్షతో కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతి రావు పూలే అని నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు.మంగళవారం నల్గొండ పట్టణంలో గడియారం సెంటర్లో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పరితపించిన మహనీయుడు పూలే అని అన్నారు. దేశ పౌరుల భవిష్యత్తుకై జీవిత కాలం పూలే చేసిన కృషి భారత సమాజంలో విప్లవాత్మక మార్పులకు బాటలు వేసిందని ఆయన అన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, సమాజంలో అణగారిన వర్గాలకు తగిన గౌరవ దక్కాలంటే విద్య ఒక్కటే మార్గమని ఆయన అన్నారు. కలెక్టర్ టి వినరు క్రిష్ణా రెడ్డి మాట్లాడుతూ మహనీయుల జయంతి ఉత్సవాలలో ప్రజలను ఎక్కువ సంఖ్యలో భాగస్వాములను చేయాలని వివిధ సంఘాల ప్రతినిధులను, నాయకులను ఆయన కోరారు. జిల్లా ఎస్.పి.అపూర్వ రావు, అదనపు కలెక్టర్ భాస్కరరావు,జిల్లా గ్రంథా లయ సంస్థ చైర్మెన్ రేగట్టే మల్లికార్జున రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, జడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య,మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్,రిటైర్డ్ ఐ. ఏ.ఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్ బి.సి.,ఎస్.సి. సంఘాల నాయకులు చక్ర హరి రామరాజు, బొర్రా సుధాకర్, నేతి రఘుపతి, కత్తుల జగన్, వైద్యుల సత్యనారాయణ, పంకజ్ యాదవ్, దుడుకు లక్ష్మీనారాయణ,, కంది సూర్యనారాయణ, కొండూరు సత్యనారాయణ, గండిచేరువు వెంకన్న, పాలడుగు నాగార్జున, సోమ మల్లయ్య, శ్రీమతి పాలడుగు ప్రభావతి, బీసీ సంక్షేమ అధికారి పుష్పలత, జిల్లా పరిషత్ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి, ఆర్డిఓ జయచంద్ర రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమణాచారి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
గొప్ప సామాజిక విప్లవకారుడు జ్యోతిరావు పూలే
సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి
బ్రహ్మనాధిపత్యాన్ని ప్రశ్నిస్తూ అంటరానితనానికి వ్యతిరేకంగా బాలికల చదువు కోసం తన జీవితాంతం అవిశ్రాంతంగా పనిచేసిన ఆధునిక సామాజిక విప్లవకారుడు మహాత్మ జ్యోతిరావు పూలే అని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి కొనియాడారు.మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతి సందర్భంగా నల్లగొండ క్లాక్ టవర్ లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాల ప్రజల కార్మిక వర్గం రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పైన వారి హక్కుల కోసం నిరంతరం పోరాడిన సంఘసంస్కర్త పూలే అని అన్నారు. సత్యశోధక సమాజాన్ని ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యం చేశారని అన్నారు.అంటరానితనం, కులవిక్ష పైనే కాక వడ్డీ వ్యాపారుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడారని మహిళా విద్య కోసం తన సతీమణి సావిత్రిబాయి పూలే కి చదువు నేర్పి మొట్టమొదటి బాలిక పాఠశాల ఏర్పాటు చేసిన ఘనత ఆయనకే దక్కిందని అన్నారు. అలాంటి మహాత్ముని స్ఫూర్తితో ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాల పైన మతోన్మాదం పైన ఉద్యమించాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ సంపదను, సహజ వనరులను స్వదేశీ, విదేశీ కార్పొరేట్ శక్తులకు ధారా దత్తం చేస్తూ అణగారిన వర్గాల ప్రజల పైన కార్మిక వర్గం పైన తీవ్రమైన దాడి చేస్తుందని విమర్శించారు. ఈ నేపథ్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే స్ఫూర్తితో మోడీ విధానాలను ప్రతిఘటించడానికి ప్రజల సిద్ధం కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి బి. పరిపూర్ణాచారి, జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, జిల్లా నాయకులు పోలే సత్యనారాయణ, జంజిరాల శ్రీనివాస్,ఎస్ సైదాచారి తదితరులు పాల్గొన్నారు.
చిట్యాల టౌన్:వెనుకబడిన బడుగు బలహీన వర్గాల హక్కులు, మహిళల విద్యాభివృద్ది కోసం శాయశక్తులా కృషి చేసిన సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతి రావు ఫూలే అని కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులుజిట్ట నగేష్ అన్నారు. చిట్యాలలో మంగళవారం ఆ సంఘం ఆధ్వర్యంలో పూలే జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజం లో కుల వివక్షత, అంటరాని తనం పై రాజీలేని పోరాటం చేసిన వారిలో పూలె దంపతులు అగ్రగణ్యులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం)మండల నాయకులు నారబోయ్న శ్రీనివాసులు, శీలా రాజయ్య, ఐతరాజు నర్సింహ, వివిధ ప్రజా సంఘాల నాయకులు రుద్రారపు పెద్దులు, లడే రాములు, ఈసం రాజు, గుడిసె లక్ష్మి నారాయణ, మహేష్, రమేష్, శ్రీను,పురుషోత్తం, గణేష్, నర్సింహ, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.
చిట్యాల పట్టణంలో మహాత్మా జ్యోతిబాపూలే 197వ జయంతి సందర్భంగా విగ్రహానికి జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పోకల దేవదాసు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షులు,మాజీ కో ఆప్షన్ మెంబర్ ఎస్.కె ఇబ్రహీం,ఒబిసి డిపార్ట్మెంట్ మండల అధ్యక్షుడు జంపాల వెంకన్న,ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ జిట్ట చిన్న స్వామి నాయకులు,తదితరులు పాల్గొన్నారు
జ్యోతిరావు పూలే మహనీయుడని బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి అన్నారు. జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా మంగళవారం మునిసిపల్ పరిధిలో శివనే గూడెం లో జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మేడి రాజు,శివనేనిగూడెం బూత్ అధ్యక్షులు రుద్రవరం కుమార్, మున్సిపాలిటీ నాయకులు గ్యార శేఖర్, ఏర్పుల నితిన్, ఎల్లమ్మ, అనిత, మారమ్మ, పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు.
మహాత్మ జ్యోతి బాపూజీ జయంతి సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు కూరెళ్ళ శ్రీను ఆధ్వర్యంలోఆయన విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి గంజి గోవర్ధన్, దళిత మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాస శ్రీనివాస్, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి కన్నబోయిన మహాలింగం , తదితరులు పాల్గొన్నారు.
నల్గొండ రూరల్ : సామాజిక విప్లవకారుడు సమసమాజ స్థాపనకు కృషి చేసిన మహనీయుడు జోతిభా పూలే స్పూర్తితో మనువాద విద్య విధానాన్ని ప్రతిఘటించాలని కామన్ స్కూల్ విద్యావిధానం కోసం కృషి చేయాలని కెవిపిఎస్ జిల్లా ప్రదాన కార్యదర్శి పాలడుగు నాగార్జున పిలుపునిచ్చారు. గడియారం సెంటర్లోని జ్యోతిరావు పూలే 197వ జయంతి ఉత్సవాలు పురస్కరించుకుని మంగళవారం కెవిపిఎస్ ప్రజాసంఘాలు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికిి పూలమాలలు వేసిన అనంతరం మాట్లాడుతూ జ్యోతిరావు పూలే ఈ సమాజంలో ఉన్నటువంటి నిశ్చలమెట్ల కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేశారని సతీసహగమనానికి వ్యతిరేకంగా పోరాటం చేశారని బ్రాహ్మణవాదానికి వ్యతిరేకంగా పూజారి లేకుండా పెళ్లిళ్లు చేశారని అన్నారు. ఈ కార్యక్రమములో వృత్తిదారుల సంఘం జిల్లా కన్వీనర్ గంజి మురళీధర్ ఐద్వా వ జిల్లా ప్రధాన కార్యదర్శి కాలడుగు ప్రభావతి అరుణ మంజుల కరుణశ్రీ శ్రీ వేణి రాధిక తదితరులు పాల్గొన్నారు.
మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతి సందర్భంగా పెదగడియారం సెంటర్లో ఉన్న ఫూలే విగ్రహానికి సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నతనంలోని అంటరానితనానికి గురై ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు నా జాతి అవమానాల గురికాకుండా ఉండాలంటే చదువుతోనే సాధ్యమని ఆయన చెప్పారు .
మహాత్మ జ్యోతిరావు పూలే 197 వ జయంతి మంగళవారం నల్లగొండ గడియారం సెంటర్లోని విగ్రహానికి సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు వారి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి సదాలక్ష్మి దుబ్బ కొండమ్మ ఓరుగంటి స్వామి జ్యోతి దేవుళ్ళ సాంబశివరావు బత్తుల స్టీఫెన్ పాల్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలోఆ పార్టీ నల్లగొండ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఎల్వి. యాదవ్, నాయకులు బొంత రమేష్, కూరెళ్ళ విజరు కుమార్, గుండు వెంకటేశ్వర్లు, గోవు నాగరాజు, కొండేటి దయాకర్, వీర్ల పరమేష్, తదితరులు పాల్గొన్నారు.
ఎన్జీ కళాశాలలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గణ శ్యామ్ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జాతీయ సేవా పథకం అధికారులు, అధ్యాపక బృందం, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ కార్యాలయం లో మహాత్మా జ్యోతిరావు ఫూలే చిత్రపటానికి ఆ పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఎల్వి.యాదవ్ పూలమాలలు వేసి నివాలులర్పించారు. ఈ కార్యక్రమంలో బొంత రమేష్, కూరెళ్ల విజరు కుమార్, గుండు వెంకటేశ్వర్లు, గోగు నాగరాజు,కొండేటి దయాకర్, వీర్ల పరమేష్ తదితరులు పాల్గొన్నారు.
నకిరేకల్ : మహాత్మా జ్యోతిబాపూలే జయంతిని పురస్కరించుకొని వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహానికి శంకుస్థాపన
మహాత్మ జ్యోతిబాపూలే జయంతిని పురస్కరించుకొని నకిరేకల్ పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆయన విగ్రహానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య ద్వారానే బడుగు, బలహీన వర్గాలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. మహిళలు చదువుకుంటేనే అసమానతలు తొలగిపోతాయని భావించిన జ్యోతిబాపూలే మొదట తన భార్య సావిత్రిబాయి పూలేను విద్యావంతురాలిని చేసిన గొప్ప ఆచరణవాది పూలే అని కొనియాడారు.
సమాజ పునర్నిర్మాణానికి పూలే కృషి చిరస్మరణీయం: సీపీఐ(ఎం)
సమాజ పునర్ నిర్మాణానికి పూలే చేసిన కృషి చిరస్మరణీయమని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు కందాల ప్రమీల పేర్కొన్నారు. పూలే జయంతిని పురస్కరించుకొని మంగళవారం స్థానిక నర రాఘవరెడ్డి భవనంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అసమానతపై పోరాడిన ఆదర్శమూర్తి మహాత్మ జ్యోతిబాపూలే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ చిన్న వెంకులు, మండల, పట్టణ కార్యదర్శులు రాచకొండ వెంకట్ గౌడ్, వంటిపాక వెంకటేశ్వర్లు, కెవిపిఎస్ జిల్లా నాయకులు ఒంటెపాక కృష్ణ, నాయకులు యానాల కృష్ణారెడ్డి,బి ప్రకాష్ రావు, ఆది మల్ల సుధీర్ జీ బుచ్చి రాములు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో
పట్టణంలోని పన్నాల గూడెం క్యాంపు కార్యాలయంలో జ్యోతిరావుఫూలే చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివక్ష లేని సమానత్వ సమాజం కోసం జీవితాంతం శ్రమించిన గొప్ప సామాజిక తత్వవేత్త జ్యోతిబాపూలే అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూజర్ల శంభయ్య , స్థానిక కౌన్సిలర్లు, మండల నాయకులు పాల్గొన్నారు..
కొండేటి మల్లయ్య ఆధ్వర్యంలో
మహిళలు చదువుకునేందుకు మార్గదర్శకుడై విద్య ఎవరి సొత్తు కాదని నిరూపించిన మహనీయుడు జ్యోతిబాపూలే అని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య పేర్కొన్నారు. మంగళవారం పూలే జయంతిని పురస్కరించుకుని తన నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుంకరబోయిన నర్సింహ యాదవ్, పన్నాల రాఘవరెడ్డి, లింగాల వెంకన్న, జఠంగి వెంకట నర్సయ్య, యాస కర్ణాకర్ రెడ్డి, మహేశ్వరం నగేష్, మాచర్ల సైదులు, బొప్పని యాదగిరి, యువజన నాయకులు బొంబారు శ్రీను, పల్ రెడ్డి ఉపేందర్ రెడ్డి, సురిగి జ్యోతి, ఒంటెపాక ప్రసాద్, ఇరుగు రవి, ఆవుల వేణు, పావిరాల సైదులు పాల్గొన్నారు.
దైద రవీందర్ ఆధ్వర్యంలో
సమానత్వ సమాజం కోసం జ్యోతిబాపూలే కురిచేసారని టీపీసీసీ రాష్ట్ర మాజీ కార్యనిర్వాహక కార్యదర్శి దైద రవీందర్ పేర్కొన్నారు. మంగళవారం పూలే జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గాజుల సుకన్య శ్రీనివాస్ , దైద స్వప్న, మాజీ సింగిల్ విండో చైర్మన్ గార్లపాటి రవీందర్ రెడ్డి, నాయకులు యం.డి యూసుఫ్ , బీరవోలు ఉపేందర్ రెడ్డి , చింతల శ్రీనివాస్ యాదవ్ , అబ్దుల్ మజీద్ , దీకొండ ధనమ్మ , చెనగోని రాజశేఖర్ గౌడ్ , చెరుపల్లి సైదులు , పశుపతి , దైద సురేష్ , వంటెపాక సతీష్ , నల్గొండ సాయి , శ్రవణ్ , పందిరి సతీష్ , రాపోలు నగేష్ పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే వేదాసు వెంకయ్య ఆధ్వర్యంలో
మహాత్మ జ్యోతిబాపూలే జయంతి వేడుకలను మాజీ ఎమ్మెల్యే వేదాసు వెంకయ్య ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు గుణగంటి రాజు, నాయకులు పుల్లయ్య, కొత్తపల్లి సైదులు అలుగుబెల్లి మహేందర్ రెడ్డి, నోముల రవికుమార్, వెంకటేశ్వరరావు, భయ్యా ముత్తయ్య, జిల్లా నాగయ్య, కొత్తపల్లి ఎల్లయ్య, పందిరి నాగయ్య పాల్గొన్నారు.
మహాత్మ జ్యోతిబాపూలే జయంతిని నకిరేకల్ మెయిన్ సెంటర్లో మంగళవారం డీఎస్పీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి మేడి ప్రియదర్శిని, నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి విజరు, చిట్యాల మండల ప్రధాన కార్యదర్శి మేడి రాజు, కేతాఫల్లి మహిళా కన్వీనర్ శృతి, మండల బివిఎఫ్ కన్వీనర్ శివ, సినియర్ నాయకులు గ్యార శేఖర్, నితిన్, వినరు మల్లేష్ పాల్గొన్నారు.
మహాత్మా జ్యోతిబాపూలే జయంతి వేడుకలను టిడిపి ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నియోజకవర్గ కో కన్వీనర్ యాతాకుల అంజయ్య,
భువనగిరి పార్లమెంటు కమిటి కార్యనిర్వాహణ కార్యదర్శి నక్కరాంబనేష్ ముదిరాజు, మున్సిపల్ పట్టణ అధ్యక్షులు పసుపులేటి కృష్ణారెడ్డి, మండల మాజి ప్రదానకార్యదర్శి దోమ్మాటి సైదులు , రాచకొండ లింగయ్య పాల్గొన్నారు.