Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
జిల్లా దాసు ఆశయాలు సాధిద్ధామని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు అన్నారు.బుధవారం మండలపరిధిలోని కాపుగల్లు గ్రామంలో సీపీఐ(ఎం) సీనియర్ నాయకుడు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు జిల్లా దాసు సంస్కరణ సభలో వారి చిత్రపటానికి పూలమాలవేసి జోహార్లు అర్పిస్తూ మాట్లాడారు.గ్రామస్థాయి నుంచి మండల నియోజకవర్గ స్థాయిలో వ్యవసాయ కార్మికులు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పైన అనేక ఉద్యమాలు చేసి ప్రజా సమస్యల పరిష్కరించడంలో జిల్లా దాసు ముఖ్యపాత్ర పోషించారన్నారు. కాపుగల్లు గ్రామంలో వ్యవసాయ కార్మికులకు కూలి రేట్లు పెంచే విషయంలో ఆ గ్రామంలో కూలీలను ఏకం చేసి కూలి పోరాటాలు నడిపి కులి రేట్లు పెంచుకునే వారిని ఆ గ్రామంలో సీపీఐ(ఎం) నాయకునిగా పని చేస్తూ తుదిశ్వాస విడిచేంత వరకు ఎర్రజెండా నీడలోనే పని చేశారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు జుట్టుకొండ బసవయ్య, ఎం.ముత్యాలు, మండల కార్యదర్శి అలసగాని బ్రహ్మయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు బొజ్జ చినవెంకులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు వెల్ది పద్మావతి, సీఐటీయూ కోదాడ మండల కార్యదర్శి ఎస్.రాధాకష్ణ ,జిల్లా మాజీ డీసీసీబీ చైర్మెన్ ముత్తవరపు పాండురంగారావు, డాక్టర్ ఎస్.సూర్యనారాయణ, గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు సైదానాయక్, శ్రీను,జిల్లా బోసుబాబు, కాసానిధనయ్య పాల్గొన్నారు.