Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పల్లె నాగేశ్వరరావు
నవతెలంగాణ-హుజూర్నగర్
రాష్ట్రంలో ప్రస్తుతం న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు కషి చేస్తానని హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పల్లె నాగేశ్వరరావు అన్నారు బుధవారం స్థానిక కోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ఆయన సతీమణి సరితతో కలిసి మాట్లాడారు.తనకు జన్మనిచ్చిన, తానువిద్యను అభ్యసించిన ఈ ప్రాంతాన్ని తాను ఎప్పుడు మరిచిపోనన్నారు.ఈ ప్రాంత న్యాయవాదుల అభ్యున్నతికి ఎల్లవేళల కషి చేస్తానన్నారు త్వరలో సీఎం కేసీఆర్‌ను కలిసి రాష్ట్రంలో న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.15 వేల ఉపకారవేతనం అందించాలని విజ్ఞాపన పత్రాన్ని సమర్పిస్తామన్నారు.స్థానిక కోర్టు సమస్యలతో పాటు న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సాముల రామిరెడ్డి చేస్తున్న కషిని ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు.న్యాయవాదుల రక్షణ కోసంన్యాయవాద రక్షణ చట్టం తేవాలని ప్రభుత్వం పై ఒత్తిడి చేస్తామన్నారు.న్యాయవాదుల జోలికి ఎవరైనా వస్తే ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదన్నారు.బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సామల రామిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలపై పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి రాష్ట్ర బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పల్లె నాగేశ్వరరావు అన్నారు.నాగేశ్వరరావు భవిష్యత్‌లో మరిన్ని పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు.బడుగు బలహీన వర్గాల ప్రజాసేవకు మరింత అంకితం కావాలని కోరారు.అనంతరం పల్లె నాగేశ్వరరావు సరిత దంపతులను గజమాల, పూలమాలతో, శాలువాలతో పలువురు సన్మానించారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సామల రామిరెడ్డి జక్కుల నాగేశ్వరరావు, న్యాయవాదులు కాల్వ శ్రీనివాసరావు, రవికుమార,్ చనగాని యాదగిరి, వట్టికోటి అంజయ్య ,రమణారెడ్డి, పి.చంద్రయ్య,చల్లా కృష్ణయ్య, పాలేటి శ్రీనివాసరావు, కొట్టు సురేష్, ధూళిపాల శ్రీనివాసరావు, సురేష్‌నాయక్, శంకర్‌నాయక్, సైదాహుస్సేన్, క్రాంతి, ప్రదీప్తి,రమాదేవి, ఆర్.వెంకటేశ్వర్లు, ఎం.గోపినాథ్, మాధవరెడ్డి,ఏజీపీలు అంబటి శ్రీనివాసరెడ్డి ,గోపాల కష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.