Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ రూరల్
బడ్జెట్లో నిధులు తగ్గించి ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్రం చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నారీ ఐలయ్య, మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దండంపల్లి సరోజలు పిలుపునిచ్చారు. బుధవారం నల్లగొండ మండలం దండెంపల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించి కూలీలతో కలిసి పని ప్రదేశంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వామపక్ష పార్టీల పోరాటాల ఫలితంగా యూపీఏ ప్రభుత్వం గ్రామీణ పేదలకు జీవనోపాధి కోసం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పెట్టడం జరిగిందన్నారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సంవత్సరానికి 100 రోజుల పని గ్యారంటీ ఉండేదని తెలిపారు. ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో 40 శాతం నిధులు తగ్గించారని ఆరోపించారు. మారుతున్న కాలానుగుణంగా బడ్జెట్లో నిధులు పెంచి 200 రోజుల పని దినాలు 600 రూపాయల రోజు కూలి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశాలలో మంచినీరు, మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలన్నారు. పనిముట్లు, పారలు, టెంకులు, తట్టలు పంపిణీ చేయాలని చెప్పారు. అనేక గ్రామాలలో బిల్లులు పెండింగ్ ఉన్నాయని అవి వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు గోలి నరసింహ, గ్రామ అధ్యక్షురాలు గోపగోని అలివేలు, ప్రధాన కార్యదర్శి సంద గణేష్, ఉపాధ్యక్షులు పిట్టల వెంకటమ్మ, బుర్ర సాలయ్య, సహాయ కార్యదర్శి మీసాల రాములు, బుర్ర సైదమ్మ, మల్లె పోయిన బక్కమ్మ, బొడ్డుపల్లి అనసూర్య, మన్యం అంజయ్య, చింతపల్లి ధనమ్మ, అల్లి వెంకన్న, ఎలమంచమ్మ, చింతపల్లి సైదులు, తదితరులు పాల్గొన్నారు.
చనిపోయిన ఉపాధి కూలీలకు 20 లక్షలు ఇవ్వాలి
నల్లగొండ : చనిపోయిన ఉపాధి కూలీలకు 20 లక్షలు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చండూరు మండల పరిధిలోని దోనిపాముల గ్రామంలో మంగళవారం ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి ఇద్దరు చిలకరాజు లింగమ్మ (60), సూర లక్ష్మమ్మ (62) ఉపాధి హామీ కూలీలు మతి చెందారు. బుధవారం పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య జిల్లా కేంద్ర ప్రభుత్వ హాస్పిటల్లో మతుల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్కొక్క మతదేహానికి 20 లక్షలు ఆర్ధిక సాయం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దండంపల్లి సరోజ, జిల్లా సహాయ కార్యదర్శి మన్నెం భిక్షం, జిల్లా ఉపాధ్యక్షులు గండమల్ల రాములు, బొమ్మరగొని కిరణ్ (అడ్వకేట్), దోనిపాముల సర్పంచ్ తిప్పర్తి దేవేందర్, దాసరి స్వామి తదితరులు పాల్గొన్నారు.