Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నెల రోజులలో బ్రిడ్జిల నిర్మాణం పూర్తి కావాలని ఆదేశం
- పలు అభివద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
సూర్యాపేట పట్టణాన్ని దేశంలోనే నెంబర్‌వన్‌గా తీర్చి దిద్దడమే లక్ష్యంగా కొనసాగుతున్న అభివద్ధి పనులలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.బుధవారం పట్టణంలోని 15 వ వార్డ్,34 వార్డులలో ప్రజల రాకపోకల సౌకర్యార్థం మూసీీ, నాలా కాలువలపై రూ.54 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన కల్వర్ట్ బ్రిడ్జిలకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు.పార్టీలకు అతీతమైన అభివద్ద్ధినే ఎజెండాగా బీఆర్ఎస్ పార్టీ అధ్వర్యంలో పట్టణంలో సాగుతున్న అభివద్ధి పనులలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.2014 కు ముందు ప్రస్తుతం సూర్యాపేటలో ఉన్న పరిస్థితులపై ప్రజలు ఆలోచించాలని కోరారు. సూర్యాపేటను నందనవనంగా మార్చడమే తన లక్ష్యమన్నారు.శంకుస్థాపన చేసిన బ్రిడ్జి లను నెల రోజులు లోపు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పట్టణాలకు నూతన హంగులు వస్తున్నాయన్నారు.కాలనీల్లో కనీస సౌకర్యాల కల్పనకు కషి చేస్తామన్నారు. అభివద్ధి కార్య్రమాలకు శంకుస్థాపన చేయడానికి వచ్చిన మంత్రితో సెల్ఫీ దిగడానికి స్థానిక మహిళలు పొటీ పడ్డారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన పెరుమాళ అన్నపూర్ణ, మున్సిపల్ కమిషనర్ రామానుజులరెడ్డి,వైస్‌చైర్మెన్ పుట్టా కిషోర్, కౌన్సిలర్లు ఎలిమినేటి అభరు, మడిపల్లి విక్రమ్, భరత్‌మహాజన్, జ్యోతికర్నాకర్, రంగినేని లక్ష్మణ్‌రావు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు సవరాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి బూర బాలసైదులు, రాష్ట్ర కార్యదర్శి వైవీ, రాష్ట్ర నేతలు ఉప్పల ఆనంద్, గుర్రం సత్యనారాయణరెడ్డి, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు స్వరూప తదితరులు పాల్గొన్నారు.